మేలు చేసే పుచ్చకాయ


Thu,March 7, 2019 12:09 AM

ఎండాకాలం శరీరానికి సరిపడా నీటి శాతం కేవలం నీరు తాగడం వల్ల మాత్రమే దొరకదు. మార్కెట్లో పుష్కలంగా దొరికే పుచ్చకాయ ద్వారా శరీరానికి అందాల్సిన విటమిన్లు అందుతాయి. పుచ్చకాయ తినడం వల్ల లాభాలేంటో చూద్దాం!
watermelon
-పుచ్చకాయ శరీరానికి చలువ చేస్తుంది. శరీరంలోంచి వేడిని దూరం చేస్తుంది. ఉదర సంబంధిత రుగ్మతలను దూరం చేస్తుంది. ఇందులోని ఐరన్, విటమిన్లు పాస్పరస్, క్యాల్షియం వంటి ధాతువులు వేసవిలో శరీరానికి మేలు చేస్తాయి.
-సిట్రస్ ధాతువులు పుచ్చకాయలోని ఎరుపు భాగంలో కాకుండా తెలుపు రంగు భాగంలో పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా పుచ్చకాయ తినడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. వేసవిలో రోజూ 4 లేదా 5 కప్పుల పుచ్చకాయ ముక్కల్ని తీసుకుంటే మంచిది.
-పుచ్చకాయ తినడం వల్ల మూత్రపిండంలోని మలినాలు తొలిగిపోతాయి. కిడ్నీ సంబంధిత వ్యాధులను దూరం చేసే గుణం పుచ్చకాయలో ఉంటుంది. రక్త ప్రసరణ వేగంగా జరిగేందుకు కూడా పుచ్చకాయ ఉపయోగపడుతుంది.
-వేసవిలో చెమట రూపంలో నీరు బయటికి వచ్చేస్తుండడంతో శరీరం డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల వేసవిలో ప్రతి రోజు పుచ్చకాయ తినడం మంచిది.
-పుచ్చకాయ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది. డయబెటీస్ ఉన్నవారు పుచ్చకాయ విత్తనాలను రోజూ తింటే రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయి నియంత్రణంలో ఉంటుంది. హైబీపీ ఉన్నవారు పుచ్చకాయ విత్తనాలను తింటే బీపీ తగ్గుతుంది.

641
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles