మేలు చేసే కొత్తరకం డైపర్లు!


Mon,January 21, 2019 12:06 AM

ప్రస్తుతం మార్కెట్‌లో లభించే డైపర్ల వల్ల అటు చిన్నారులకు, ఇటు ప్రకృతికీ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నది. అటువంటి ప్రమాదం నుంచి తప్పించడానికి ఓ తల్లి తన కొడుకు వలే ఆ బాధ ఎవరూ పడకూడదని వినూత్న ప్రయోగంతో ప్రత్యామ్నాయాన్ని
సూచిస్తున్నది.

daiper-baby
సింథటిక్ క్లాత్‌ను ఉపయోగించిన డైపర్లను వాడడం వల్ల చిన్నారులు పలు రుగ్మతల బారిన పడుతున్నారు. అంతేకాదు సింథటిక్ డైపర్ల తయారీలో ఉపయోగించే ప్లాస్టిక్ కారకాలతో ఎటువంటి నష్టం కలుగుతున్నదో అందరికీ తెలియజేస్తూ వారిని చైతన్య పరుస్తున్నది దివ్య సిద్దార్థ. చిన్నారులకు వినియోగించిన డైపర్లను ఆరుబయట పడేయడం వల్ల అవి భూమిలో కరగకుండా ఉండి కాలుష్యానికి కారణమవుతుందనే విషయాలను జనాలకు వివరించే ప్రయత్నం చేస్తున్నది. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్‌కు చెందిన దివ్య ఓ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నది. ఐదు నెలలున్న తన బిడ్డకు సింథటిక్ డైపర్లు వాడడం వల్ల చర్మ సమస్యలు తలెత్తాయి. అందుకోసం ఆమె ఇంటి దగ్గరే ఉండి తన బిడ్డను చూసుకోవాల్సి వచ్చింది. ఒక రోజు తన స్నేహితురాలు బట్టతో రూపొందించిన డైపర్లను తన కొడుకుకు బహుమతిగా అందజేసింది. దివ్య తన కొడుకుకు బట్టతో తయారుచేసిన డైపర్లను వినియోగించడం వల్ల కలిగిన సౌకర్యాన్ని తెలుసుకున్నది. అదే సమయంలో సహజమైన బట్టతో బేబీ డైపర్లను తయారుచేయాలని నిర్ణయించింది. విదేశాల నుంచి నాణ్యమైన బట్టను తెప్పించి తానే స్వయంగా సహజమైన డైపర్లను రూపొందించింది దివ్య. తాను తయారు చేసిన డైపర్లను తన కొడుకుపైనే ప్రయోగించి విజయవంతమైంది. అటు చిన్నారులకు, ఇటు పర్యావరణానికీ ఎటువంటి హాని ఉండదని నిరూపించింది. ఆ తర్వాత దివ్య నెమ్మదిగా తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా జనాలకు తాను రూపొందించిన సహజసిద్ధమైన డైపర్లను వాడడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేసింది. అనంతరం దివ్య తయారుచేసిన డైపర్లకు ఆదరణ పెరుగడంతోకిడ్డీ హగ్ పేరుతో ఫేస్‌బుక్ పేజీని ప్రారంభించింది. కొద్దిరోజులకే దివ్య ఉత్పత్తులను కొనుగోలు చేసేవారి సంఖ్య పెరిగింది. ప్రస్తుతం దివ్యకు సోషల్ మీడియాలో 19వందల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఐదేండ్ల వయసున్న పిల్లల వరకూ ఉపయోగించుకునేలా డైపర్లను తయారు చేసింది. తన ఉత్పత్తులను త్వరలోనే దేశవ్యాప్తంగా ప్రముఖ ఈ కామర్స్ వేదికలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల ద్వారా అమ్మకాలు జరుపనున్నట్లు ఆమె తెలిపింది.

901
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles