మేకప్ అందానికే కాదు..


Mon,April 15, 2019 01:01 AM

అందం ప్రతిబింబించేందుకు మేకప్ వేసుకుంటారు మహిళలు. మేకప్ కేవలం ఫ్యాషన్ కాదు. అది ఒక ఆర్ట్ అంటున్నది రూపేందర్ అషాన్. ప్రత్యేకమైన మేకప్ టెక్నిక్స్‌తో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.
mekup
ఆమె మేకప్ ఆర్టిస్ట్‌గా పేరుగాంచింది. బ్యూటీపార్లర్ నుంచో, డిప్లొమా చేసో ఆమె అనుభవం పొందలేదు, పురాణాల నుంచి, సంస్కృతి నుంచి, ప్రకృతి నుంచి ఆమె మేకప్, ఆర్ట్ పద్ధతులు, మెళకువలు నేర్చుకుంది. దాదాపు ఆ అంశాలనే ఆమెను చేయి తిరిగిన మేకప్ ఆర్టిస్ట్‌గా చేశాయి. రూపేందర్ లండన్‌లో పుట్టి, పెరిగింది. తల్లిదండ్రులు భారతీయులు. దీంతో ఇక్కడి కల్చర్ ప్రభావం ఆమె మీద పడింది. ఒక దశలో ప్రభావితురాలైంది. అప్పటికే ఆమె చిన్న మేకప్ ఆర్టిస్ట్‌గా ఉంది. వాటిని ఇన్‌స్టాలో పోస్ట్ చేసేది. కానీ ఏదైనా కొత్తగా చేయాలని అనుకున్నది. అప్పటి నుంచి కొత్త రకమైన మేకప్‌లను ప్రయత్నించింది. జోంబీ స్టయిల్‌లో ఇటీవల ఓ వధువుకు వేసిన మేకప్ సోషల్ మీడియాలో అందిరినీ మంత్రముగ్దుల్ని చేసింది. ఆమె వేసే మేకప్‌లు అన్నీ ఇలా పురాణాలు, కల్చర్‌తో ముడిపడే ఉంటాయి. నాకు మాత్రం మేకప్ అంటే ఒక కళ. 15 గంటలు నిర్విరామంగా వేసినా అలసట రాదు అంటున్నదామె. రూపేందర్ వృత్తిరీత్యా టాక్స్ అడ్వైజర్. లండన్‌లోనే ఆమె వృత్తి బాధ్యతలు నిర్వహిస్తూ.. మేకప్ ఆర్ట్‌ను అభిరుచిగా ఎంచుకున్నారు.
mekup1

371
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles