మెరుపులు.. మెరిసేలా!


Thu,February 14, 2019 11:40 PM

మిలమిల మెరిసే పట్టు చీర అయినా.. జరీ అంచు లేని నెట్ చీర అయినా..మగువల మనసుల్ని దోచేస్తాయి.. ఏ అకేషన్‌లోనైనా.. చక్కనమ్మ.. ఏ చీర కట్టినా అందమే కదా! అందుకే మెరిసే చీరల కలెక్షన్‌తో వచ్చిన.. పట్టు.. ఫ్యాన్సీ చీరలను ఈ వారం తీసుకొచ్చాం..
SAMEERS-Saress
1. ఆకుపచ్చని నెట్ చీర చూడముచ్చటగా ఉంది. దీనికి గోల్డెన్ బీడ్స్‌తో ఫుల్‌గా వర్క్ వచ్చింది. గోల్డెన్ బ్లౌజ్ మ్యాచ్ అయింది. నెట్ స్లీవ్స్ మీద రిబ్బన్, జరీ, సీక్వెన్స్ వర్క్ మరింత మెరుస్తున్నది.

2. చెక్స్ ప్యాటర్న్ ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. యాష్ కలర్ పట్టు చీరకి గోల్డెన్ చెక్స్ వచ్చాయి. పింక్ కలర్ జరీ బిగ్ బార్డర్ చీర అందాన్ని పెంచింది. దీనికి యాష్, పింక్ రంగుల కాంబినేషన్‌లో వచ్చిన బ్లౌజ్ పర్‌ఫెక్ట్ మ్యాచింగ్.

3. పర్పుల్ కలర్ పట్టు చీరకి సిల్వర్ జరీ బార్డర్ వచ్చింది. రెండు వైపులా పెద్ద బార్డర్, పల్లూ ఆకట్టుకుంటున్నది. దీనికి కాంట్రాస్ట్‌గా ఉండాలని ఆకుపచ్చని బ్లౌజ్ మీద పర్ల్, థ్రెడ్, సీక్వెన్స్‌తో హెవీగా హై నెక్‌తో డిజైన్ చేయించారు.

1049
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles