మెట్‌గాలాలో ఇషా అంబానీ!


Fri,May 10, 2019 01:38 AM

ఇటీవలే మెట్‌గాలా వేడుక అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ వేడుకలో పాల్గొనేందుకు హాలీవుడ్ తారలు వెరైటీ అలంకరణతో ముస్తాబై అదరగొట్టారు. వారిలో ఇషా అంబానీ ప్రత్యేకంగా నిలిచారు.
isha-ambani
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మెట్రోపాలిటన్ మ్యూజి యం ఆఫ్ ఆర్ట్స్, కాస్ట్యూమ్ ఇన్‌స్టిట్యూట్ ప్రతి ఏడాది మెట్‌గాలా అనే షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో జరిగే రెడ్‌కార్పెట్‌లో పాల్గొనేందుకు మేటి మోడల్స్ విభిన్న దుస్తులలో హాజరవుతుంటారు. కొన్ని నెలల పాటు జరిగే ఈ షోకి వచ్చే విరాళాలని చారిటీలకి వినియోగిస్తుంటారు. ఈ యేడాది జరిగిన మెట్‌గాలా వేడుకలకు ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ సరికొత్త డ్రెస్‌లో అలరించింది. ప్రముఖ డిజైనర్ ప్రబల్ గురుంగ్ డిజైన్ చేసిన వాయ్‌లెట్ కలర్ గౌన్ వేసుకొని మెరిసింది. ఆ ఫొటోలను ప్రబల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశాడు. ఈ డ్రెస్‌ను తయారు చేయడానికి కనీసం 350 గంటలు పట్టిందట. డ్రెస్ ఈకలతో విభిన్నంగా ఉంది. అంతేకాదు డ్రెస్‌కు నప్పేలా మెడలో అందమైన జ్యుయెలరీ ధరించి అతిథులను ఆశ్యర్యపరిచేలా చేసింది ఇషా. ఈ వేడుకలో రింగుల జుట్టు, సిల్వర్ కలర్ గౌనులో ప్రియాంక చోప్రా విభిన్నంగా కనిపించింది.

287
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles