మృదుత్వం కోసం..


Fri,April 19, 2019 01:53 AM

curd-pack
-చెంచా చొప్పున పెరుగు, శనగపిండి కలిపి నీళ్లు చేర్చి మిశ్రమంలా చేయాలి. దీన్ని ముఖానికి రాసి ఇరవై నిమిషాల తర్వాత చన్నీళ్లతో కడిగేయాలి. చెంచా ముల్తానీ మట్టిలో చెంచా పెరుగు వేసుకుని కలపాలి. దీనికి కొన్ని చుక్కల గులాబీ నీళ్లు కలిపి ముఖానికి ప్యాక్‌లా వేయాలి. మొటిమెల నివారణకు ఈ ప్యాక్ పనిచేస్తుంది.
-అరటిపండును బాగా చిదిమి దానికి చెంచా చొప్పున పెరుగూ, శనగపిండి, గుడ్డులోని తెల్లసొన చేర్చి ముఖానికి రాయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే ముఖం కాంతితో మెరిసిపోతుంది. ఇలా వారం రోజులు ఇలా ప్రయత్నిస్తే ముఖకాంతి మీ సొంతమవుతుంది.
-చెంచా పెరుగులో రెండు చెంచాల ఓట్ మీల్ పౌడర్ వేసి కలిపి ఈ మిశ్రమాన్ని వేళ్లతో తీసుకుని ముఖంపై వలయాకారంగా రుద్దుతూ ఉండాలి. పావుగంట తర్వాత చన్నీళ్లతో కడిగేస్తే సరి. ఈ ప్యాక్ ముఖానికి మెరుపునిస్తుంది.
-కళ్ల కింద మచ్చలు పోవాలంటే.. ఆరెంజ్ జ్యూస్, గ్లిజరిన్‌లను కలిపి కళ్ల చుట్టూ పూసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా వారంలో మూడుసార్లు చేస్తే కళ్ల చుట్టూ ఉండే చర్మం తేటగా తయారవుతుంది.

174
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles