మూడేండ్ల శ్రమ ఫలితం..


Sat,April 13, 2019 12:33 AM

ఈ అనంత విశ్వంలో అత్యంత ప్రమాదకరమైనది ఏదైనా ఉంది అంటే అది బ్లాక్ హోల్. మనం దీన్ని కృష్ణబిలంగా అభివర్ణిస్తాం. ఇప్పటి వరకు దీన్ని ఎవరూ చూడలేదు. ఎంతపెద్ద ఖగోళ వస్తువులైనా బ్లాక్‌హోల్ అమాంతం తనలో కలుపుగోలదు. అలాంటి కృష్ణబిలం మొదటి ఫొటో ఇది. మూడేండ్ల ప్రయోగాల ఫలితం.
black-hole
అమెరికాకి చెందిన కేటీ బౌమన్ అనే మహిళా శాస్త్రవేత్త బ్లాక్‌హోల్ చిత్రాన్ని మొదటిసారి క్యాప్చర్ చేసింది. ఇప్పటివరకు బ్లాక్‌హోల్‌ని క్యాప్చర్ చేయడానికి ఎన్నో ప్రయోగాలు చేసింది 29 యేండ్ల బౌమన్. ఇందుకోసం దాదాపు మూడేండ్లు ప్రయోగాలు చేసింది. మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో కంప్యూటర్ సైన్స్, కృత్రిమ మేధస్సులో పట్టభద్రురాలైనది బౌమన్. టెలీస్కోప్ నుంచి లక్షలాది గిగాబైట్ల డేటాను సేకరించినప్పటికీ, బ్లాక్‌హోల్ చిత్రాన్ని బంధించడానికి కుదరలేదు. ఈ క్రమంలో మూడేండ్ల కిత్రం అల్గారిథం రూపొందించింది. వందల ప్రయోగాల తర్వాత ఆమె తయారు చేసిన అల్గారిథం.. కృష్ణబిలం దృశ్యాన్ని బంధించేందుకు సాయపడింది. ఈనెల 10న మొదటి బ్లాక్‌హోల్ చిత్రాన్ని క్యాప్చర్ చేసింది బౌమన్. ఈ విషయం తాను ట్విటర్‌లో పంచుకోవంతో అంతా అభినందనలు తెలుపుతున్నారు. బౌమన్ చేసిన ఈ ప్రాజెక్ట్ ఎంతోమంది యువ మహిళా శాస్త్రవేత్తలకు ఆదర్శంగా నిలుస్తుందంటున్నారు. ఈ బ్లాక్‌హోల్ ఎంత శక్తివంతంమైందంటే సెకనుకి మూడు లక్షల కిలోమీటర్లతో ప్రయాణించే కాంతిని కూడా తనవైపు లాక్కోగలదు. ఈ కృష్ణబిలంలోకి ఏదైనా గ్రహం వెళ్లిందంటే తిరిగి వెనక్కి రావడం జరగదు.

485
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles