ముల్లంగితో చర్మ సంరక్షణ


Fri,May 17, 2019 12:36 AM

dandru
-ముల్లంగిలో ఉండే మినరల్స్, విటమిన్స్ మన చర్మం, జుట్టుకు తగిన పోషణను అందివ్వడంలో ఎంతగానో సాయపడుతుంది. తరచూ ఆహారంలో తీసుకుంటే చర్మకాంతి మీ సొంతమవుతుంది.
-ఒక టీస్పూన్ ముల్లంగి గింజలు, నీరు తగినంత తీసుకుని ముల్లంగి గింజలను మెత్తగా రుబ్బి పొడిలా చేసుకోవాలి. దీనికి కొన్ని చుక్కల నీటిని జోడించి బాగా కలపాలి. ఈ పేస్టును ముఖం మీద ఐప్లె చేయాలి. పూర్తిగా ఎండిపోయాక చల్లటి నీటితో కడిగితే ముఖం తాజాగా కనిపిస్తుంది.
-ఒక టేబుల్ స్పూన్ తరిమిన ముల్లంగి, ఒకటిన్నర టేబుల్ స్పూన్ పెరుగు, 5 చుక్కల బాదం నూనె తీసుకోవాలి. ఒకగిన్నెలో తురిమిన ముల్లంగిని తీసుకుని, దానికి పెరుగును చేర్చి బాగా కలపాలి. చివరగా బాదం నూనె జోడించి ముఖం మెడకు ఐప్లె చేయాలి. ఆ తర్వాత కడిగితే ముఖకాంతి మీ సొంతమవుతుంది.
-ఒక టేబుల్ స్పూన్ ముల్లంగి రసాన్ని ఒక గిన్నెలో తీసుకుని అందులో ఒక కాటన్ ప్యాడ్ నానబెట్టుకోవాలి. ఈ కాటన్ బాల్ లేదా కాటన్ ప్యాడ్‌ను ఉపయోగించి ముల్లంగి రసాన్ని బ్లాక్‌హెడ్స్ ఉన్న ప్రాంతాల్లో ఐప్లె చేయాలి. 20 నిమిషాల తర్వాత కడిగితే బ్లాక్‌హెడ్స్ పోతాయి.
-ముల్లంగి తొక్క తీసి ముక్కలుగా చేయాలి. దీన్ని గ్రైండ్ చేసి రసాన్ని వేరు చేసుకోవాలి. ముల్లంగి రసాన్ని తలపై పూయాలి. టవల్‌ను తలకు చుట్టాలి. 30 నిమిషాలు అలాగే వదిలేసి ఆ తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చేస్తే చుండ్రు సమస్య పూర్తిగా తొలిగిపోతుంది.

228
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles