మునగకాయలతో మేలు!


Fri,September 7, 2018 01:23 AM

drumsticks
-మునగకాయల పౌడర్, తేనె, రోజ్ వాటర్, నిమ్మరసంలో కొంత నీటిని చేర్చి పేస్టులా తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని శుభ్రపరిచిన ముఖం, మెడపై రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత నీటితో కడిగేయాలి. పొడి బట్టతో తుడిచి మాయిశ్చరైజర్‌ను రాసుకోవాలి. ఇలా తరుచూ చేస్తే ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
-మునగతో చేసిన ఆయిల్, పేస్టును ముఖంపై ఉన్న మొటిమల మీద రాసుకోవాలి. ఇలా తరుచూ చేయడం వల్ల ముఖం మెరిసిపోతుంది.
-మునగతో చేసిన ఆయిల్‌ను ముఖానికి రాసుకోవడం వల్ల చర్మంపై ఉన్న ముడతలు, గీతలు తగ్గుతాయి. ఇది వృద్ధాప్య ఛాయలను తగ్గించి చర్మాన్ని బలంగా, గట్టిగా ఉంచుతుంది.
-ప్రతిరోజూ నిద్రించే ముందు మునగతో చేసిన ఆయిల్‌ను పెదవులపై ఐప్లె చేయాలి. ఇలా చేయడం వల్ల పెదాలు తేమగా ఉండడంతో పాటు మృదువుగా అవుతాయి.
-చర్మాన్ని ప్రకాశవంతం చేసే కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేయడానికి మునగ చమురు సహాయపడుతుంది. చర్మంపై ఉన్న పెద్ద రంధ్రాలను చిన్నవిగా చేయడంలోనూ ఇది ఎంతో తోడ్పడుతుంది.

873
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles