ముడుతలు మాయం!


Thu,January 17, 2019 01:53 AM

శరీరంపై ముడుతలు ఏర్పడుతున్నాయంటే కారణం సరైన తేమ లేకపోవడం. శీతాకాలంలో అయితే ఈ సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. ఇలాంటి ముడతలు చిన్న చిన్న చిట్కాలతో ఇట్టే మాయం చేయవచ్చు.
tips
-మూడు లేదా నాలుగు గుడ్లను తీసుకొని, దాని నుంచి తెల్ల సొనను వేరు చేయాలి. దాంతో శరీరంపై మర్దన చేయాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడుగాలి. ఇలా తరుచుగా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
-నిమ్మకాయను ముక్కలుగా కోసి ఒక గిన్నెలో తీసుకోండి. ముఖం భాగంలో, ముడతలు ఉన్న ప్రాంతంలో ముక్కలతో చిన్నగా రుద్దాలి. పది నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగేయాలి.
-నిద్రకు ముందు ఆలివ్ ఆయిల్ రాసుకొని పడుకోవాలి. ఉదయం లేచిన తర్వాత తుడిచేయాలి. ఇలా కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్‌తో ముడుతల చర్మానికి పరిష్కారం చూపవచ్చు.
-కలబంద జెల్‌ను ఒక గిన్నెలోకి తీసుకొండి. అందులోకి కొంచెం విటమిన్-ఇ నూనెను పోయాలి. ఈ రెండింటినీ కలిపి, మిశ్రమాన్ని ముఖానికి అప్లయ్ చేయండి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగిస్తే సరిపోతుంది.
-పైనాపిల్ కూడా ముడుతల మొహానికి చక్కగా ఉపయోగపడుతుంది. కొన్ని పైనాపిల్ ముక్కలతో ముఖాన్ని మర్దనా చేయొచ్చు. ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.

670
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles