ముఖారవిందానికి..!


Mon,March 11, 2019 12:45 AM

వేసవిలో చర్మంపై టాన్ ఏర్పడుతుంది. దీన్ని నివారించడానికి అమ్మాయిలు బ్యూటీపార్లల్ చుట్టూ తిరుగుతుంటారు. ఖర్చు లేకుండా ఇంటి వద్దనే అందం పెంపొందేలా కొన్ని చిట్కాలు..
FACE
-కాసింత పసుపులో కొన్ని నీళ్లు పోసి పేస్ట్ చేసి రోజూ ముఖానికి పట్టించాలి. దీంతో ముఖం మీదుండే సన్నని వెంట్రుకలు రాలిపోతాయి. పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణం మొటిమలు, మచ్చలు కూడా తొలిగించడంలో తోడ్పడుతుంది.
-వేప కాయలు, ఆకులు, పువ్వులు సమానంగా కలిపి మెత్తగా పేస్ట్ చేయాలి. రోజుకు రెండుసార్లు కొద్దిగా తింటే తెల్లమచ్చలు క్రమంగా తగ్గుతూ వస్తాయి. కొద్ది రోజులకు ముఖ కాంతి మీ సొంతమవుతుంది.
-రోజూ రెండు మూడు మెంతి ఆకుల్ని నమిలి చప్పరిస్తే, జీర్ణశక్తి పెరిగి, కడుపు ఉబ్బరం, తేన్పులు తగ్గుతాయి. తులసి ఆకులు రోజుకు రెండు మూడు తింటే ఆరోగ్యానికి మంచిది. నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది.
-మందారం ఆకుల్ని నూరి షాంపూగా వాడితే జుట్టు బాగా పెరుగుతుంది. చుండ్రు నివారణలోనూ, తెల్లవెంట్రుకల నిరోధకంలోనూ ఎంతగానో తోడ్పడుతుంది. కొబ్బరి నూనెలో మందారం ఆకుల్ని మరిగించి వడపోసి ఆ నూనెను తలకు పట్టిస్తే జుట్ట ఒత్తుగా పెరుగుతుంది.
-కరివేపాకుల్ని మిరియాలతో కలిపి తింటే ముక్కులో వచ్చే అలర్జీలు తగ్గిపోతాయి. అంతే కాకుండా కరివేపాకు నిత్యం వంటల్లో ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం సమస్య తగ్గిపోతుంది.

871
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles