ముఖవర్చస్సు కోసం


Wed,March 6, 2019 02:40 AM

మహిళలు అందం కోసం చాలా సమయాన్ని వృథా చేస్తుంటారు. మరికొందరైతే ఏకంగా బ్యూటీపార్లర్లలోనే తిష్ఠవేస్తున్నారు. ఇలాంటి వాళ్లకు తేలిగ్గా పది నిమిషాల్లో చర్మం తాజాగా కనిపించే చిట్కాలివి.
glow
-సౌందర్య పోషణలో నిమ్మకాయది ప్రత్యేక స్థానం. ముఖంపై నల్లటి మచ్చలు, తెల్లటి మచ్చలను, చర్మ రంధ్రాలను నిమ్మరసం తొలిగిస్తుంది. మొటిమల నివారణకు నిమ్మ ఎంతో దోహదపడుతుంది.
-స్పూన్ నిమ్మరసంలో కాసింత దూదిని ముంచి ముఖానికి ఐప్లె చేయాలి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుక్కోవాలి. ఇలా చేస్తే నల్లటి మచ్చలు పోతాయి.
-నిమ్మరసంలో రెండు మూడు చుక్కలు తేనె కలిపి ముఖానికి పట్టించాలి. 15 నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖం తాజాగా ప్రకాశవంతంగా మారుతుంది.
-ఒక చిన్న టమాటాను గుండ్రంగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలతో ముఖాన్ని 5 నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. ఆ తర్వాత ఓ స్పూన్ నారింజ రసంలో కొద్దిగా పాలపొడి, గంధం, తేనె వేసి కలుపాలి. ముఖానికి పట్టించి 10 నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖం నిగనిగలాడుతుంది.
-ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల ముఖం కాంతివంతంగా ఉంటుంది. దీంతో పాటు కేశాలు, గోళ్లు కాంతివంతంగా తయారవుతాయి.
-ఆరెంజ్‌లో ఉన్న సి విటమిన్, పొటాషియం, ఫోలిక్ ఆసిడ్ కలిగి ఉండడం ద్వారా చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది.

216
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles