మీ పాస్‌వర్డ్ బలంగా ఉందా?


Wed,January 2, 2019 12:59 AM

password
ఇంతకీ మీ పాస్‌వర్డ్‌లు బలమైనవేనా? అసలు చెత్త పాస్‌వర్డ్‌లు ఎలా ఉంటాయి? సులభంగా హ్యాక్ చేయగల పాస్‌వర్డ్‌లు సేకరించి ప్రతీ ఏడాది ఫ్లాష్‌డేటా అనే సంస్థ వంద చెత్త పాస్‌వర్డ్‌లను ఏడాది చివర్లో ప్రకటిస్తుంది. ఈ ఏడాది కూడా ఆ జాబితా విడుదల చేసింది. ఆ జాబితాలో అమెరికా అధ్యక్షుడైనా ట్రంప్ పేరును ఉద్దేశించిన పాస్‌వర్డ్ 23వ చెత్త పాస్‌వర్డ్ స్థానంలోఉంది. ఎప్పట్లాగే 123456 అనే పాస్‌వర్డ్ ప్రపంచ పరమ చెత్త పాస్‌వర్డ్‌గా మొదటిస్థానంలో నిలిచింది. ఎవరూ మన పాస్‌వర్డ్ దొంగిలించకుండా ఉండాలంటే ఈ సూచనలు పాటించండి.

-పాస్‌వర్డ్ ఆరు నుంచి ఎనిమిది క్యారెక్టర్లు ఉండేలా చూసుకోండి.
-ఎంచుకునే పాస్‌వర్డ్‌లో లోయర్‌కేస్, అప్పర్‌కేస్ లెటర్లు, స్పెషల్ క్యారెక్టర్లు, సింబల్స్ ఉండటం సేఫ్.
-పుట్టినరోజులు, మొబైల్ నంబర్, వాహనం నంబర్ ఎట్టి పరిస్థితుల్లోనూ పాస్‌వర్డ్‌గా పెట్టుకోవద్దు.
-ఇంతకీ మీరు పెట్టుకున్న పాస్‌వర్డ్ స్ట్రాంగా ఉందా? మీ పాస్‌వర్డ్‌ని హ్యాక్ చేయడానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకోవాలనుందా? అయితే ఈ కింది లింక్ క్లిక్ చేయండి. https://bit.ly/24oYk4k

ఇవే ఆ చెత్త పాస్‌వర్డ్‌లు

123456, password, 123456789, 12345678, 12345, 111111, 1234567, sunshine, qwerty, iloveyou, princess, admin, welcome, 666666, abc123, football, 123123, monkey, 654321, [email protected]#$%^amp;*, charle, aa123456, donald, password1, qwerty123

1294
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles