మీ ఉప్పులో ప్లాస్టిక్ ఉందా?


Mon,September 10, 2018 11:04 PM

ఉప్పులో ప్లాస్టికా? అని పరేషాన్ కాకండి. నిజంగానే మనం రోజూ తీసుకునే ఉప్పులో అతి సూక్ష్మమైన ప్లాస్టిక్ అణువులు కలుస్తున్నాయని పరిశోధకులు చెప్తున్నారు. ఉప్పులో ప్లాస్టిక్ కలవడం వల్ల ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని.. ఉప్పు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వారు సూచిస్తున్నారు.
spilled-salt
మనం రోజూ తినే ఉప్పులో ప్లాస్టిక్ కలుస్తుందని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బాంబే) పరిశోధకులు చెప్తున్నారు. ఉప్పు-ప్రభావం అనే అంశంపై తాజాగా అధ్యయనం జరిపారు. సగటు ఇండియన్ రోజుకు 5 గ్రాముల ఉప్పు వినియోగిస్తున్నాడు. సంవత్సరానికి సగటున ఒక వ్యక్తి 117 మైక్రోగ్రాముల మైక్రోప్లాస్టిక్‌ను తింటున్నట్లు పరిశోధకులు చెప్తున్నారు. ప్రతీ కిలోగ్రాం ఉప్పులో 63.76 ఉప్పు కణాలు ఉన్నట్లు వారు గుర్తించారు. భారతదేశంలో ఉప్పు ఒక పొటెన్షియల్ స్ట్రాటజీగా మారడంతో వినియోగం అదే స్థాయిలో పెరుగుతూ పోతున్నది. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఇబ్బడి ముబ్బడిగా ఉప్పు తయారీ కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. ఒకదానికొకటి పోటీ పడి ఉప్పును కల్తీ చేసే ప్రయత్నంలో ఉప్పులో ప్లాస్టిక్ రేణువులను కలుపుతున్నట్లు పరిశోధకులు చెప్తున్నారు. ఉప్పులో ప్లాస్టిక్ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. నాణ్యమైన బ్రాండెడ్ ఉప్పునే వాడాలని వారు సూచిస్తున్నారు.

81
Tags

More News

VIRAL NEWS