మీకు చెవుడు వచ్చినట్లే..!


Sun,March 3, 2019 01:33 AM

మీ చెవుల్లో ఎప్పుడు చూసినా ఇయర్‌ఫోన్స్ ఉంటున్నాయా? హెడ్‌సెట్‌లో పాటలు వినడం ఇష్టమా? అయితే మీకు ఇష్టమైన సంగీతమే.. ప్రమాదాన్ని తెస్తుందని హెచ్చరిస్తున్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ.
Music-Effect
ఇయర్ ఫోన్స్‌తో ఎక్కువ సేపు మ్యూజిక్ వినడం చాలా ప్రమాదకరం. ఎంతలేదన్నా.. వీటిని 15 నిమిషాలకు మించి ఎక్కువ వాడకూడదు. ఎందుకంటే ఇలా చెవుడు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్నది. కేవలం 60 సెం.మీ. దూరంలో ఉన్న అలారం శబ్దం 60 డెసిబుల్స్. దాన్నే మంచానికి దగ్గరగా ఉంచకూడదంటారు నిపుణులు. మనోళ్లు ఎప్పుడు చూసినా.. దూర ప్రయణాలు చేసినా చెవిలో హెడ్‌ఫోన్స్, ఇయర్ ఫోన్స్ ఉండాల్సిందే. ఇక మీరే ఆలోచించుకోండి.. పరిస్థితి ఎంత తీవ్రతరమో. చెవుడు రావడానికి ప్రధాన కారణం వయసు పెరగడమైతే.. పెద్ద శబ్దాలు దగ్గరగా వినడం రెండో కారణం అని భారత్‌కు చెందిన నేషనల్ హెల్త్ సర్వీస్ సంస్థ వెల్లడించింది. పెద్ద శబ్దాల వల్ల కలిగే చెవుడుకి ఎలాంటి చికిత్స, పరిష్కారం లేదు. చెవి లోపలి కణాలను సరిచెయ్యలేమని చెబుతున్నారు కూడా. ఎందుకైనా మంచిది జాగ్రత్త పడడం ఉత్తమం.

530
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles