మిల్లెట్ మంత్ర.. ఆరోగ్య తంత్ర!


Sat,February 9, 2019 02:04 AM

ఈ మధ్య ఏది తింటే ఆరోగ్యానికి మంచిది అనే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ముఖ్యంగా సిరిధాన్యాలు తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? అనే అంశం ఆహార ప్రియులకు ఆసక్తిని కగిలిస్తున్నది. ఈ విషయంపై బెంగళూర్‌కు చెందిన పదో తరగతి విద్యార్థి తనదైన పద్ధతిలో ప్రచారం కల్పిస్తున్నాడు.
bengaluru
బెంగళూరుకు చెందిన ఈ 15 యేండ్ల విద్యార్థి పేరు ఆర్క పుడొట. ఇటీవలే పదో తరగతి పూర్తి చేశాడు. మిల్లెట్ మంత్ర పేరుతో యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించి సిరిధాన్యాల వినియోగం వల్ల జరిగే మేలును గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తునాడు. తానే స్వయంగా వంటకాలను తయారు చేసి, వాటి ఉపయోగాలను వీడియోల రూపంలో వివరిస్తున్నాడు. అనంతరం వాటిని తన యూట్యూబ్ చానల్‌లో అప్‌లోడ్ చేస్తున్నాడు. ఆర్క రూపొందిస్తున్న వీడియోలన్నీ ప్రజా ప్రయోజనం కోసమే. ఇవే కాకుండా సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, పండ్లు ఎలా పండించాలనే విషయాలను కూడా తెలిపే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందుకు తన సోదరుడి సహకారం తీసుకుంటున్నాడు. నేటితరం చిన్నారులు అమితంగా ఇష్టపడే ఫాస్ట్‌ఫుడ్‌ను రాగులు, జొన్నలు, సజ్జలు వంటి వాటితో ఎలా తయారు చేసుకోవచ్చో కూడా చెబుతున్నాడు ఆర్క. ఇటీవల అంతర్జాతీయ చిరుధాన్యాల ప్రదర్శనలో పాల్గొని.. తన విజన్ వివరించాడు. ఈట్ మిల్లెట్స్, గ్రో స్మార్ట్, లైవ్ స్మార్ట్ అంటూ ప్రత్యేకంగా ప్రచారం చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.

937
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles