మిల్లెట్ మంత్రతో ఆరోగ్య మంత్రం !


Sun,March 3, 2019 12:40 AM

పిల్లలంటే ఎప్పుడూ స్కూలు, పుస్తకాలు, ఆటలే కాదు. అప్పుడప్పుడూ బయటి ప్రపంచంలో జరిగే విశేషాలనూ తెలుసుకుంటూ ఉంటారు. కొందరు తెలుసుకొని వదిలేస్తారు. మరికొందరు తెలుసుకున్న జ్ఞానాన్ని తమదైన శైలిలో వ్యక్తపరుస్తారు. సరిగ్గా అదే కోవకు చెందిన ఈ కుర్రాడు ఓ యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించి దాని ద్వారా సేంద్రియ పంటలు, సిరిధాన్యాలను గురించి తెలిపే ప్రయత్నం చేస్తున్నాడు.
bengaluru
స్కూల్ పిల్లలు తమకు ఇచ్చిన హోమ్‌వర్క్‌తోనే కుస్తీ పట్టడం చూస్తుంటాం. కానీ, బెంగళూరుకు చెందిన ఈ 15 యేండ్ల అర్క పుదోట పదోతరగతి పూర్తిచేశాడు. అనంతరం చిరుధాన్యాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించడంతోపాటు సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, పండ్లు ఎలా పండించాలనే విషయాలను తెలిపే ప్రయత్నం చేస్తున్నాడు. మిల్లెట్ మంత్ర పేరుతో యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించి సిరిధాన్యాల వినియోగం వల్ల జరిగే మేలుపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. తానే స్వయంగా ఏ వంటకాన్ని ఎలా తయారు చేసుకోవాలో కూడా తెలియజేస్తూ వీడియో రూపంలో తన యూట్యూబ్ చానల్‌లో అప్‌లోడ్ చేస్తున్నాడు. చిరుధాన్యాల వాడకం తగ్గడం వల్ల జరిగే దుష్ప్రభావాలను వెల్లడిస్తూనే, జనాలను మరింతగా చైతన్య పరుస్తున్నాడు. అర్క పుదోట తన సోదరుని సహకారంతో చిరుధాన్యాల్లో దాగి ఉన్న ఆరోగ్య సమాచారాన్ని అందిస్తున్నాడు. నేటితరం చిన్నారులు అమితంగా ఇష్టపడే ఫాస్ట్ ఫుడ్‌ను రాగులు, జొన్నలు, సజ్జలు వంటి వాటితో ఎలా తయారు చేసుకోవాలో చెబుతున్నాడు అర్క. అంతేకాదు పెరట్లో సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, పండ్లు ఎలా పండించాలో కూడా వివరిస్తున్నాడు. ఇటీవల అంతర్జాతీయ చిరు ధాన్యాల ప్రదర్శనలో పాల్గొని మిల్లెట్ మంత్రతో ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో తెలియజెప్పాడు. ఈట్ మిల్లెట్స్, గ్రో స్మార్ట్ , లైవ్ స్మార్ట్ అంటూ ప్రత్యేకంగా ప్రచారం చేసి అందరి ప్రశంసలూ అందుకుంటున్నాడు.

721
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles