
7200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న మిరాకిల్ గార్డెన్‌ను దుబాయిలో నిర్మించారు. ప్రతి ఏడాది నవంబర్ రెండో వారం తర్వాత పార్క్ నిండా పూలు పూస్తాయి. దీనిని 2013, ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం రోజున ప్రారంభించారు. ఇందులో సుమారు 150 మిలియన్ల పువ్వులున్నాయి. ప్రపంచంలోనే అతి పొడువైన గార్డెన్ గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకెక్కింది. లక్షలకు పైగా పూల మొక్కలున్న ఈ గార్డెన్లో వందల రకాల పువ్వుల జాతులున్నాయి. ప్రతి ఏడాది మిరాకిల్ గార్డెన్‌ను సుమారు 15 మిలియన్ల మంది సందర్శిస్తారు.