మితం హితం!


Sun,March 10, 2019 12:26 AM

చాలా మంది బరువు తగ్గాలని కలలు కంటుంటారు. కానీ ప్రయత్నం కూడా చేయరు. ఒక వేళ చేసినప్పటికీ ఇంకా బరువు పెరుగుతుంటారు. ఈ చిన్న చిట్కాలతో బరువు తగ్గొచ్చు ప్రయత్నించండి..
rice
-బరువు తగ్గాలనుకునేవారు రైస్‌కు దూరంగా ఉండడమే మంచిది. వైట్ రైస్‌లో కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల అది బరువు పెరిగేలా చేస్తుంది. అందుకు అన్నం రోజుకో పూట తీసుకుంటే సరిపోతుంది.
-డైట్‌లో ఉన్నవారు రాత్రి సమయంలో అన్నం తినకూడదు. ఆ సమయంలో జీర్ణక్రియ నెమ్మదిగా పని చేస్తుంది. జీర్ణక్రియకు కాస్త విశ్రాంతినిచ్చేలా లైట్‌ఫుడ్ తీసుకోవడం మంచిది.
-రాత్రిపూట అన్నం బదులు చపాతీ తీసుకోవడం మంచిది. అంతేకాకుండా అన్నం తినకపోవడం వల్ల షుగర్, బ్లడ్ లెవెల్స్ ట్రాక్‌లో ఉంటాయి. అనారోగ్య సమస్యలు దరిచేరవు.
-బరువును కంట్రోల్ చేసుకోవాలనుకునే వారు కనీసం ఒక నెల, రెండు నెలలు వైట్‌రైస్‌కు దూరంగా ఉండాలి. అన్నం అధికంగా తినడం వల్ల శరీరం బరువుగా తయారవుతుంది. అందుకే మితమే హితం.
-బరువు తగ్గాలనుకునే వారు రాత్రిపూట చపాతీకి బదులు పండ్ల రసాలు, పండ్లు తినడం మంచిది. రైస్ తీసుకుంటే కేవలం కార్బోహైడ్రేట్స్ మాత్రమే శరీరానికి అందుతాయి. కానీ పండ్లు, రసాలు తీసుకోవడం వల్ల విటమిన్లు కూడా అందుతాయి.

352
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles