మాల్గుడి స్టేషన్‌ని నిజంగా చూడొచ్చు!


Wed,March 6, 2019 02:39 AM

మాల్గుడి కథలంటే ఇష్టముండని వారుండరు. కథల్లో కనిపించే అందమైన రైల్వే స్టేషన్ నిజం కాదు. అది కేవలం కల్పితం మాత్రమే. ఇకపై నిజంగానే చూడొచ్చు అంటున్నారు ఇండియన్ రైల్వే అధికారులు. అంతేకాదు, సెల్ఫీలు కూడా దిగొచ్చు. అదెలాగంటే?
malgudi
ప్రముఖ రచయిత ఆర్.కె. నారాయణ్ రాసిన మాల్గుడి కథలు గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఆయన కథలతో దూరదర్శన్‌లో ప్రసారమైన మాల్గుడి డేస్‌కు అప్పట్లో ఎనలేని ఆదరణ లభించింది. ఆ కథల్లో కనిపించే మాల్గుడి రైల్వే స్టేషన్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేది. నిజం చెప్పాలంటే అక్కడ మాల్గుడి రైల్వే స్టేషన్ అనేదే లేదు. అది కల్పితం మాత్రమే. అయితే ఇండియన్ రైల్వే ఆ కల్పితాన్ని నిజం చేయనున్నట్లు ప్రకటించింది. ఇకపై మాల్గుడి రైల్వే స్టేషన్‌ని రీల్‌లోనే చూసిన మీరంతా రియల్‌గా కూడా చూడొచ్చు. కర్ణాటకలోని అరసలు రైల్వే స్టేషన్ పేరును మాల్గుడి రేల్వై స్టేషన్‌గా పేరు మార్చనున్నారు. హోసానగర్ తాలుకాలోని శివమొగ్గ - తలగుప్ప రైల్వే లైన్‌లో ఈ రైల్వే స్టేషన్ ఉంది. ఒకప్పుడు మాల్గుడి డేస్ పేరుతో ప్రసారమైన ధారావాహికల్లో ఈ రైల్వే స్టేషన్‌ను మాల్గుడి పేరుతో చూపించేవారు. దానికి దర్శకత్వం వహించిన నటుడు శంకర్ నాగ్ జ్ఞాపకార్థంగా ఈ రైల్వేస్టేషన్‌కు మాల్గుడి పేరు పెడుతున్నారు. ఈ స్టేషన్‌ను 1.3 కోట్లతో ఆధునికీకరించనున్నారు. స్టేషన్‌లో మాల్గుడి మ్యూజియం కూడా ఏర్పాటు చేయనున్నారు. 1954లో కర్ణాటకలోని ఉడిపిలో జన్మించిన శంకర్ నాగ్ నటుడుగానే కాకుండా స్క్రీన్‌ప్లే, డైరెక్టర్, ప్రొడ్యుసర్‌గా కూడా పేరుగాంచారు. 36 యేండ్ల వయస్సులోనే ఆయన కన్నుమూశారు. శంకర్ నాగ్ 1990లో కారు ప్రమాదంలో మరణించారు. మాల్గుడి స్టేషన్‌ని చూసినవారంతా నాగ్‌ని తలుచుకోవడం ఖాయం అంటున్నారు అక్కడి ప్రజలు.

272
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles