మార్కెట్‌ను మలుపు తిప్పే లార్జ్‌క్యాప్ షేర్లు


Sat,February 16, 2019 01:47 AM

sensex

రెండేండ్లలో సెన్సెక్స్ 50,000
ఆర్థిక వ్యవస్థకు లార్జ్‌క్యాప్ ప్రతిరూపం


మార్కెట్‌లో అనిశ్చిత పరిస్థితులు ఇన్వెస్టర్లను గందరగోళానికి గురిచేస్తున్నాయి. వచ్చే ఆరునెలల పాటు అనిశ్చితి కొనసాగనుంది. అయితే, దీర్ఘకాలానికి మదుపు చేసేవారికి మార్కెట్‌లో ప్రస్తుతం అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.


కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడితే మార్కెట్లు కొత్త గరిష్ఠస్థాయిలను చేరుకుంటాయి. ఎన్నికల ఫలితాలు మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయనడానికి గత సాక్ష్యాలేవీ లేవు. అయితే స్వల్ప కాల ఒడిదుడుకులు సహజంగా అన్ని రకాల వార్తలకు మాదిరిగానే ఎన్నికల ఫలితాల వల్ల కూడా వస్తాయి. ఈనేపథ్యంలో మార్కెట్‌లో మదుపు చేయాలనుకునే వారు పెద్ద కంపెనీలలో మదుపు చేయడం మేలు. గత ఏడాది కాలంగా మార్కెట్‌లో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ కంపెనీలలో భారీ పతనం జరిగినా, లార్జ్ క్యాప్ కంపెనీలు మాత్రమే నిలదొక్కుకోగలిగాయి. దేశీయ స్టాక్ మార్కెట్ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో లార్జ్ క్యాప్‌ల వాటా 70 శాతం. సెబీ జారీ చేసిన నిర్వచనం ప్రకారం టాప్ 100 మార్కెట్ క్యాప్ కంపెనీలను లార్జ్‌క్యాప్‌లు పరిగణించాలి. వీటి మార్కెట్ విలువ ఆధారంగా ప్రతి త్రైమాసికంలో ఒకసారి అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇండియా జాబితా తయారు చేస్తుంది. అలాగే నిఫ్టీలోనూ, నిఫ్టీ నెక్ట్స్ 50లో వుండే వంద షేర్లూ లార్జ్ క్యాప్ కోవలోనికే వస్తాయి.


లార్జ్‌క్యాప్‌లోనే మదుపు ఎందుకంటే..

ఈ కోవలోకి వచ్చే కంపెనీలన్నీ ఆయా రంగాల్లో పెద్ద కంపెనీలే అయి ఉంటాయి. అలాగే వివిధీకరణ చెంది ఉంటాయి. పటిష్టమైన బిజినెస్ మోడల్స్‌తో మార్కెట్ లీడర్స్‌గా ఉంటాయి. పటిష్టమైన బ్యాలన్స్‌షీట్లతో సరిపడా మూలధనాన్ని కలిగి ఉండి నిధులను ఏ సమయంలోనైనా సమికరీంచుకోగలిగిన సత్తాను కలిగి ఉంటాయి. రాబడుల్లోనూ స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి. మెజారిటీ కంపెనీలు కార్పొరేట్ గవర్నెన్స్ పాటిస్తూ ఉంటాయి. ఈ కంపెనీల షేర్లలోనే లిక్విడిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. షేర్ హోల్డింగ్స్ కూడా వివిధీకరణ చెందిఉంటుంది. సంస్థాగత ఇన్వెస్టర్లంతా వీటిపైనే దృష్టి పెడుతుంటారు. దేశీయ ఆర్థికాభివృద్ధిలో వీటి పాత్ర కూడా ఉంటుంది. అలాగే ఆర్థిక వ్యవస్థలోని ప్రధాన రంగాల్లో ఉంటాయి.


గత చరిత్ర...

పైన పేర్కొన్న అంశాలు ఉన్న కారణంగా నిఫ్టీ కంపెనీలు టాప్-100 కంపెనీల పనితీరు కొన్నేండ్లుగా తిరుగులేనిదిగా ఉంది. ఒకప్పుడు నిఫ్టీలో క్యాపిటల్ విస్తరణతో కూడిన ఇండస్ట్రియల్స్, యుటిలిటిస్, మెటీరియల్స్, టెలికం, ఇంధన రంగాలది


31 శాతం వెయిటేజి ఉంటే ఇప్పుడది 27 శాతానికి తగ్గిపోయింది. ప్రస్తుతం బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలకు 37 శాతంతో గరిష్ఠ వెయిటేజి ఉంది. నిఫ్టీ స్థిరంగా ట్రేడ్ అవడానికి కూడా ఈ రంగంలోని షేర్లు మంచి పనితీరును కనబరచడమే కారణం. ఆ తర్వాత స్థానం కన్జ్యూమర్ రంగానిది. మార్కెట్ రికవరీ మొదట లార్జ్ క్యాప్‌తోనే ప్రారంభం అవుతుంది. ఎందుకంటే ఆయా పరిశ్రమల్లో వచ్చే రికవరీ తొలుత పెద్ద కంపెనీలతోనే ప్రారంభం అవుతుంది. ఆ తర్వాతనే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్‌లకు ర్యాలీ పాకుతుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు వెలువడిన ఆర్థిక ఫలితాల్లో నిఫ్టీ కంపెనీలే ప్రోత్సాహకర ఫలితాలను వెల్లడించగలిగాయి. గత ఏడాది 9నెలల కాలానికి ఈ ఏడాది తొమ్మిది నెలల కాలానికి పోల్చితే నిఫ్టీ కంపెనీల రాబడుల్లో భారీ వృద్ధి నమోదు అయింది. ఈ నేపథ్యంలో ఫార్వర్డ్ పీఈ నిష్పత్తి 2020 ఆర్థిక సంవత్సరానికి 16.8గానూ, 2021 సంవత్సరానికి 14.4గా ఉంటుందని అంచనా. దీంతో ప్రస్తుతం ఉన్న గరిష్ఠ స్థాయి పీఈ నిష్పత్తి వచ్చే ఆర్థికసంవత్సరంలో గణనీయంగా తగ్గిపోతుంది. ఈ ఫండమెంటల్ అంశంతో మార్కెట్‌లో లార్జ్‌క్యాప్ షేర్లలో మదుపు చేయడానికి ఇదే సమయం.
sensex1

లార్జ్‌క్యాప్‌లో సిప్‌ల ద్వారా మదుపు చేసి ఉంటే గత ఐదేం డ్ల కాలంలో సగటున ఏటా 13.94% రాబడి వచ్చింది. నిఫ్టీ-50 లో 12.81 శాతం, నిప్టీ నెక్ట్స్-50లో 19.99 శాతం రాబడి వచ్చింది. వీటన్నింటికి తోడు లార్జ్‌క్యాప్‌లో ఒడిదుడుకులు కూడా చాలా తక్కువగా ఉంటాయి.


సాధారణ ఎన్నికలు మరో నాలుగు నెలల్లో జరగనున్న నేపథ్యంలో మార్కెట్ చాలా అప్రమత్తంగా సైడ్‌వేస్‌లో ట్రేడ్ అవుతూ ఉన్నది. ఎన్నికల ఫలితాలపై స్పష్టత, కేంద్రంలో సుస్తిర ప్రభుత్వం ఏర్పడే అవకాశాలుంటే మార్కెట్‌లో రికవరీ చాలా వేగంగా వస్తుంది. వచ్చే ఆరు నెలల కాలం మార్కెట్ ఒడిదుడుకులమయంగా ఉన్నా వచ్చే రెండేండ్ల కాలం దృష్టితో చూస్తే అపారమైన అవకాశాలున్నాయి. సెన్సెక్స్ 50,000 పాయింట్లను చేరుకోవడానికి మెరుగైన అవకాశాలున్నాయి. ఒకవేళ అస్పష్ట మెజారిటీతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అయితే అనిశ్చితి మరికొంత కాలం కొనసాగుతుం దే కానీ ఎల్లకాలం ఉండదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఆర్థిక సంస్కరణలు, విధానపర నిర్ణయాలు కొనసాగుతాయి.


మదుపు వ్యూహం

స్పల్పకాలిక ఒడిదుడుకులను పక్కన పెట్టి ప్రతిపతనంలోనూ లార్జ్‌క్యాప్ షేర్లు లేదా లార్జ్ క్యాప్ ఫోకస్‌తో ఉన్న మ్యూచువల్ ఫండ్లను ఎంపిక చేసుకోవాలి. మదుపు కాలపరిమితి రెండేండ్ల నుంచి ఐదేండ్ల కన్నా ఎక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి. అలాగే ఎస్‌ఐపీ పద్దతిన పతనంలో ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉండవచ్చు. 2020 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థానికి మార్కెట్లో సందిగ్దత తొలగిపోయి అప్‌ట్రెండ్‌లోకి మారిపోయే అవకాశం వుంది. స్వల్పకాలానికి ఐటీ, హెల్త్‌కేర్, ఫార్మా, కన్జ్యూమర్ రంగాలు మెరుగ్గానూ, డిఫెన్సివ్ రంగాలుగా పనిచేస్తాయి. మెటల్స్ రంగానికి పూర్తిగా దూరంగా ఉండండి. అలాగే మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లకూ దూరంగా ఉండాలి.
sensex2

634
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles