మాంసం.. గుడ్లు నిషేధం!


Fri,April 12, 2019 12:49 AM

మొదటి శాఖాహార నగరం ఉందని తెలుసా? అక్కడ గుడ్లు, మాంసం నిషేధించారని ఎప్పుడైనా చదివారా?
palitana
గుజరాత్‌లోని పలిటానా ప్రపంచంలోనే మొట్టమొదటి శాఖాహార నగరం. ఇక్కడ మాంసం, గుడ్లు చట్టవిరుద్ధం చేశారు. పర్వతంపై ఉన్న అతి తక్కువ నగరాల్లో ఇది ఒకటి. జంతు వధ, మాంసం తినడం, గుడ్లు అమ్మడం అన్నీ నిషేధించారు. జైన మతానికి సంబంధించిన తొమ్మిది వందల ఆలయాలు ఇక్కడ ఉన్నట్టు ఆధారాలున్నాయి. జైనంలో శాంతి,అహింసవంటి విషయాలు ముఖ్యంగా ప్రస్తావించబడ్డాయి. అందుకే వారు హింసను పూర్తిగా నిషేధించారు. అంతేందుకు వాళ్లు నడుస్తున్నప్పుడు కీటకాలు కనిపిస్తేనే వాటికి ఎలాంటి హాని కలుగకుండా అవి దాటిన తర్వాత నడుస్తారు. మాంసం, గుడ్ల వినియోగానికి జైన మతం వ్యతిరేకం అని బోధిస్తుంది.కానీ జంతువులకు హాని కలిగించి తీసే పాలను మాత్రం స్వీకరిస్తుంది. ఈ పట్టణానికి సమీపంలో ఉన్న ప్రాంతాలను పవిత్ర స్థలాలుగా భావించి మాంస రహిత మండలాలుగా ప్రకటించారు. 200 మంది జైన మత గురువులు 2014లో నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వం ఆ పట్టణాన్ని మాంస రహిత జోన్‌గా ప్రకటించకపోతే ప్రాణాలు తీసుకోవడానికైనా వెనుకాడబోమని ఉద్యమం చేశారు.

324
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles