మహిళా పద్మాలు


Sun,January 27, 2019 02:53 AM

padma-sri
ఆ పురస్కారం అత్యున్నతం. ఆ సత్కారం గౌరవప్రదం. అంతటి విలువైన ఆ సత్కారమే పద్మ. 112 పద్మ అవార్డులను భారత ప్రభుత్వం ప్రకటించగా.. అందులో 94 అవార్డులు పద్మశ్రీలే. ఇందులో 20 పద్మశ్రీలు మహిళలను వరించడం విశేషం. వారి సేవలు చిరస్మరణీయం.. స్ఫూర్తిదాయకం. విభిన్న రంగాల్లో.. విశిష్ఠసేవలందిస్తూ.. విప్లవాత్మక మార్పులు సాధించిన ఆ మహిళామణులెవరో చూద్దాం.

పద్మవిభూషణ్

తీజన్‌బాయి


teejan-bai
రంగం : ఆర్ట్ -జానపద గానం
రాష్ట్రం : ఛత్తీస్‌గఢ్
-అంతరించి పోతున్న పాండవనీ జానపద కథను చెప్పడంలో ప్రసిద్ధురాలు తీజన్‌బాయి.
-పురుషులు మాత్రమే చెప్పే ఈ కథను పద్దెనిమిది పర్వాలు ఒకేసారి పాడగలిగే అద్భుత ప్రావీణ్యం ఆమె సొంతం.
-ఆదివాసీ నేపథ్యం నుండి వచ్చి అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు దేశంలోని ప్రతిష్టాత్మక పురస్కారాలు పద్మశ్రీ, పద్మభూషణ్‌లను అందుకున్నది.
-కేంద్రం ఈ ఏడాది పద్మవిభూషణ్ ఆవార్డుకు ఎంపిక చేసిన నలుగురిలో ఏకైక మహిళ తీజన్‌బాయి.

పద్మశ్రీలు

బచేంద్రి పాల్


1bachendri-pal
రంగం : క్రీడలు (పర్వతారోహణ)
రాష్ట్రం : ఉత్తరాఖండ్
-మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించిన మొదటి భారతీయ మహిళ, ప్రపంచంలో ఐదో మహిళ.
-దేవుడిని విశ్వసించే బచేంద్రిపాల్ దుర్గామాత చిత్రపటం, హనుమాన్ చాలీసాను ఎవరెస్ట్‌పై ఉంచారు.
-కెన్ డూ సిద్ధాంతాన్ని నమ్మి.. ఎన్నో పర్వతాలను అధిరోహించారు బచేంద్రి పాల్. ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలిచారు.

ముక్తాబెన్ పంకజ్‌కుమార్ దగ్లీ

2MukthaBen
రంగం : సామాజిక సేవ (దివ్యాంగుల సంక్షేమం)
రాష్ట్రం : గుజరాత్
-ఏడేండ్ల వయసులోనే కండ్లను కోల్పోయారు ముక్తాబెన్.
-అంధజన్ మండల్ సంస్థ ద్వారా దివ్యాంగులకు సేవలందిస్తున్నారు.
-అంధ విద్యార్థులు స్థిరపడేందుకు ఉద్యోగ శిక్షణ ఇచ్చి.. బంగారు భవిష్యత్‌ను ప్రసాదిస్తున్నారు.

రాజ్‌కుమారి దేవి

3rajkumaridevi
రంగం : వ్యవసాయం
రాష్ట్రం : బిహార్
-ముజఫాపూర్‌కు చెంది రాజ్‌కుమారి దేవి కిసాన్ చాచీగా ప్రసిద్ధి. 40 ఏండ్ల నుంచి రాజ్‌కుమారి దేవి కేవలం ఎకరం పొలంలో ఏడాదికి నాలుగు పంటలు పండిస్తున్నారు.
-మహిళా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతంలో మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చడంలో ఎంతో సేవ చేశారు.

భగీరథి దేవి

4bhagirathi-devi
రంగం : మానవ సంబంధాలు (రాజకీయాలు)
రాష్ట్రం : బిహార్
-ప్రభుత్వకార్యాలయంలో స్వీపర్‌గా పనిచేసే భగీరథి దేవి అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు. రామ్ నగర్ నియోజక వర్గానికి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సామాజిక, న్యాయం, మహిళా చైతన్యం కోసం పాటు పడ్డారు.

ద్రోణవల్లి హారిక

5Dronavalli-Harika
రంగం : క్రీడలు (చెస్)
రాష్ట్రం : ఆంధ్రప్రదేశ్
-ఆరేండ్ల ప్రాయం లోనే చెస్‌లో ఓనమాలు నేర్చుకొని అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నది హారిక.
-2000లో స్పెయిన్ ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచి వెలుగులోకి వచ్చింది.
-ప్రపంచకప్, యూత్ చాపింయన్ షిప్, కామన్‌వెల్త్, ఆసియా క్రీడల్లో పలు పతకాలు గెలిచి.. 2011లో గ్రాండ్‌మాస్టర్ హోదా పొందింది.

గోదావరి దత్తా

6Godawari-Dutta
రంగం : ఆర్ట్ (పెయింటింగ్)
రాష్ట్రం : బిహార్
-60వ శతాబ్దానికి చెందిన ప్రాచీన మిథిల (మధుబాని) పెయింటింగ్‌లో ప్రావీణ్యురాలు గోదావరి దత్తా.
-గోడకు వేసే ఈ సంప్రదాయ చిత్రకళ అంతరించిపోకుండా కాపాడుతున్న ఏకైక మహిళ. ఇప్పటి వరకు 5వేల మందికి ఈ ఆర్ట్‌లో శిక్షణ ఇచ్చారు.౦
-1934లో మిథిల రాజ్యం శిథిలాల్లో ఈ చిత్రకలను గుర్తించి.. ఆంగ్లేయులు వెలుగులోకి తెచ్చారు.

ద్రౌపది ఘిమిరే

7gouthami-ghimiri
రంగం : సామాజిక సేవ (దివ్యాంగులకు)
రాష్ట్రం : సిక్కిం
-సిక్కిం వికలాంగ సహాయతా సమితిని స్థాపించి ఎంతోమంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందించారు.
-ఎన్జీవోల సాయంతో మహిళా సాధికారత కోసం ప్రయత్నిస్తున్నారు.

రోహిణి గడ్బోలే

8rohini-godbole
రంగం : సైన్స్
రాష్ట్రం : కర్ణాటక
-పార్టికల్ ఫిజిక్స్‌లో ముప్ఫై ఏండ్లుగా పరిశోధన చేస్తున్నారు. యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసర్చ్‌తో కలిసి పని చేసి గుర్తింపు పొందారు. కాలిడార్స్ మీద పరిశోధనలతో ప్రసిద్ధికెక్కారు.
-ప్రస్తుతం ఐఐఎస్‌సీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్)లో సెంటర్ ఫర్ హై ఎనర్జీ ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.

ప్రైడెరిక్ ఇరీనా

9Ms-friederika-irina
రంగం : సామాజిక సేవ (జంతు సంరక్షణ)
దేశం : జర్మనీ
-ఇరువై మూడేండ్లుగా యూపీలోని రాధాకుంద్‌లో గోశాల నడుపుతూ 1200 ఆవుల సంరక్షణ చూస్తున్నారు. సుదేవీ మాతగా ప్రసిద్ధి చెందారు.
-20 ఏండ్లుగా మన దేశంలో ఉంటూ గోవులను సంరక్షిస్తున్నారు

స్మిత, రవీంద్రా కోల్హే (దంపతులు)

10ravindra-kolhemarathipizz
రంగం : వైద్యం (ఆయుర్వేద చికిత్స)
రాష్ట్రం : మహారాష్ట్ర
-బైరాగఢ్ గ్రామానికి రోడ్లు సరిగా లేకపోవడం వల్ల 40 కి.మీ నడిచి ప్రజలకు వైద్యం చేస్తున్నారీ దంపతులు.
-30 యేండ్లుగా కేవలం ఒక్క రూపాయికే రోగులకు మందులు అందిస్తున్నారు.
-వెయ్యి రూపాయలకు అయ్యే ఖర్చు 60 రూపాయలకే అందుబాటులోకి తెచ్చారు.

బొంబ్యాలా దేవి లైశ్రామ్

11Bombayla-Dev
రంగం : స్పోర్ట్స్ (విలువిద్య)
రాష్ట్రం : మణిపూర్
-బొంబ్యాలా 11 యేండ్ల వయసులోనే విలువిద్య శిక్షణలో చేరింది.
-విలువిద్యలో అంతర్జాతీయ స్థాయిలో ఐదు వెండి, నాలుగు బంగారు, నాలుగు కాంస్య పతకాలను సొంతం చేసుకున్నది. పదేండ్ల పాటు మన దేశపు జట్టుకు ప్రాధాన్యం వహించింది.

గీత మెహతా

12geetha-mehata
రంగం : సాహిత్యం
దేశం : యుఎస్‌ఏ
-కర్మకోల (1979), రాజ్ (1989), స్నేక్స్ అండ్ ల్యాడర్స్, గ్లింప్సెస్ ఆఫ్ మోడ్రన్ ఇండియా (1997), ఇటర్నల్ గణేష, బర్త్ టు రిబర్త్ ( 2006) అనే పేర్న పుస్తకాలు రాసింది. ఈమె రాసిన పుస్తకాలు 21 భాషల్లోకి అనువాదమయ్యాయి.
-మన సంస్కృతి సంప్రదాయాల మీద వివిధ డాక్యుమెంటరీలను నిర్మించి, దర్శకత్వం వహించారు.

మదురై చిన్న పిైళ్లె

13Madurai-ChinnaPillai
రంగం : సామాజిక సేవ (సూక్ష్మరుణాలు)
రాష్ట్రం : తమిళనాడు
-తమిళనాడులో రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సూక్ష్మరుణాలు (మైక్రోఫైనాన్స్) ఇవ్వడం ప్రారంభించారు.
-దేశంలో తొలిసారిగా గ్రామీణ మహిళల పొదుపు, రుణ సమాఖ్యను నెలకొల్పారు. ఏపీ, కర్ణాటక, పుదుచ్చేరిలలో కలాంజియం కమ్యూనిటీ బ్యాంకింగ్ ప్రారంభించారు.

తావో పోర్చోన్ లించ్

14tao-porchon-lynch
రంగం : ఆరోగ్యం (యోగ)
దేశం : అమెరికా
వందేండ్ల వయస్సులో ఈవిడ గత 70 ఏండ్లుగా యోగ అధ్యాపకురాలిగా సేవలందిస్తున్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగా పేరుతో అమెరికాలో యోగా సంస్థను స్థాపించారు. 15 వందల మందికిపైగా శిక్షకులను తయారు చేసింది. యోగాలో శిక్షకురాలిగా 2012లో గిన్నిస్ బుక్ రికార్డు సాధించింది. భారతీయ సనాతన సంప్రదాయాలంటే లించ్‌కు ఎంతో గౌరవం.

కమల పూజారి

15kamala-pujari
రంగం : వ్యవసాయం
రాష్ట్రం : ఒడిశా
-సేంద్రియ వ్యవసాయం ద్వారా వందకు పైగా పంటలు పండిస్తున్నారు.
-ప్రస్తుతం ఒడిశా ప్రభుత్వ ప్రణాళిక సంఘ సభ్యురాలిగా కొనసాగుతున్నారు.

మిలెనా సాల్వినీ

16milena-salvini
రంగం : ఆర్ట్ (కథాకళి నృత్యం)
దేశం : ఫ్రాన్స్
-మిలెనా సాల్విని ఇండియాకు వచ్చి కథాకళి, భరతనాట్యం, మోహినీ హాట్టం నేర్చుకున్నారు.
-ఫ్రాన్స్‌లో సెంటర్ మండప పేరుతో డాన్స్‌స్కూల్‌ను స్థాపించి భారతీయ కళలను నేర్పుతున్నారు. సుమారు 100 మందికి శిక్షణ ఇచ్చారు.
-భవిష్యత్‌లో దేశవిదేశాల్లో మరిన్ని డాన్స్ స్కూల్స్ స్థాపించాలనుకుంటున్నారు.

ప్రశాంతి సింగ్

17prashanthi-singh
రంగం : క్రీడలు (బాస్కెట్‌బాల్)
రాష్ట్రం : ఉత్తరప్రదేశ్
-ఇండియన్ నేషనల్ ఉమెన్స్ బాస్కెట్‌బాల్ టీమ్ కెప్టెన్. పదేళ్లుగా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
-ప్రశాంతి మూడు ఏషియన్ ఇండోర్ గేమ్స్‌కి ప్రాతినిధ్యం కూడా వహించారు.
-నేషనల్ చాంపియన్‌షిప్స్‌లో 23 మెడల్స్, కప్పులు గెలుచుకున్నారు.

డాక్టర్ శారదా శ్రీనివాసన్

18sharadha-srinivasan
రంగం : ఆర్కియాలజీ
రాష్ట్రం : కర్ణాటక
-సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ఆర్ట్, ఆర్కియాలజీ, ఆర్కిమెటలర్జీ, కల్చర్‌లో ఈమె స్పెషలైజేషన్ చేశారు.
-దక్షిణ భారతదేశంలోని కాంస్య విగ్రహాలపై పీహెచ్‌డీ చేశారు.
-1988లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్పెషల్ కేటగిరీ చిత్రంగా ఎంపికైన న్యూక్లియర్ వింటర్ సినిమాకు నటిగా, కొరియోగ్రాఫర్‌గా, దర్శకురాలిగా పనిచేశారు.

సాలుమరద తిమ్మక్క

19saalumarada-thimmakka
రంగం : సామాజిక సేవ (పర్యావరణం)
రాష్ట్రం : కర్ణాటక
-తిమ్మక్క హులికుల్-కుడుర్ జాతీయ రహదారికి ఇరువైపులా నాలుగు కిలోమీటర్ల మేర 384 మర్రిచెట్లు పెంచారు.
-106 ఏండ్ల ఈవిడ 60 ఏండ్లుగా వేలాదిగా మొక్కలు నాటారు. 1995లో భారత ప్రభుత్వం ఆమెను భారతీయ పౌర పురస్కారంతో సన్మానించింది. 1997లో ఇందిరా ప్రియదర్శిని వృక్షమిత్ర పురస్కారం అందజేసింది.

జమునాతుడు


20Jamuna-Tudu
రంగం : సామాజిక సేవ (పర్యావరణం)
రాష్ట్రం : జార్ఖండ్
-జమున పర్యావరణమే ప్రపంచంగా సేవలు అందిస్తున్నారు. ముతుర్ఖకు ఆనుకొని ఉన్న 150 ఎకరాల అటవీ ప్రాంతాన్ని స్మగ్లర్ల బారినుంచి కాపాడేందుకు నడుం బిగించింది.
-60 మంది మహిళలతో కలిసి
వన సంరక్షణ సమితిని ఏర్పాటుచేశారు. జమున జట్టును అమ్మల దళంగా పిలుస్తుంటారు.

1645
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles