మహిళల కోసం.. ఎయిర్‌టెల్‌ రక్షణ యాప్‌!


Tue,April 16, 2019 11:46 PM

ఎయిర్‌టెల్‌ పేరు చెప్పగానే అందరికీ ఆ నెట్‌వర్క్‌కి సంబంధించిన డేటా ప్యాకేజీలు, యాడ్స్‌ గుర్తొస్తాయి. అయితే.. తాజాగా మహిళల రక్షణ కోసం ఎయిర్‌టెల్‌ ఒక యాప్‌ని రూపొందించింది.
airtel-app
మహిళల భద్రతే లక్ష్యంగా ఇప్పటి వరకు ఎన్నో యాప్స్‌ వచ్చాయి. ఇంకా వస్తున్నాయి కూడా. అయితే.. నెట్‌వర్క్‌ సంస్థ అయిన ఎయిర్‌టెల్‌ కూడా మహిళా భద్రత కోసం ఒక అడుగు వేసి ‘మై సర్కిల్‌' అనే యాప్‌ని రూపొందించింది. ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌తో కలిసి రూపొందించిన ఈ యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్‌, వెరిఫికేషన్‌ పూర్తి చేయాలి. మనకు అత్యంత ఆప్తులు అనుకున్న ఐదుగురి కాంటాక్ట్స్‌ ఇందులో యాడ్‌ చేసుకోవాలి. అత్యవసర సమయంలో యాప్‌లోని బటన్‌ నొక్కితే ఐదుగురికి సమాచారం వెళ్తుంది. ఈ యాప్‌ను ఎయిర్‌టెల్‌ తయారుచేసింది కాబట్టి.. కేవలం ఎయిర్‌టెల్‌ వినియోగదారులే వాడాలి అనుకుంటే పొరపాటే. ఏ నెట్‌వర్క్‌ వాడుతున్న వారైనా వాడొచ్చు. ప్రాంతీయ భాషల ప్రాముఖ్యాన్ని దృష్టిలో పెట్టుకొని 13 భారతీయ భాషల్లో ఈ యాప్‌ రూపొందించారు. మనకు కావాల్సిన భాష కోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఎంచుకుంటే సరి.

422
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles