మస్త్ మజా @చైనా వాల్


Tue,January 22, 2019 10:38 PM

ఇండియాలో ఏ మూలకు వెళ్లినా.. ఎవరో ఒకరు ఏదో ఒక బాలీవుడ్ సాంగ్ వేసుకొని ఖుషీ అవుతుంటారు. పక్కన ఉన్నవాళ్లను కూడా ఖుషీ చేస్తుంటారు. నైన్టీస్‌లో హిట్‌సాంగ్స్‌గా నిలిచిన సాంగ్స్ అయితే ఇంకా మస్త్ మజా. పాత తరాన్ని.. ఇప్పటి నయా జనరేషన్‌నూ ఉర్రూతలూగించే బాలీవుడ్ సాంగ్స్ ఇప్పుడు ఓ వింత ప్రాంతంలో వినిపిస్తున్నాయి.
Dil-Toh-Pagal-Hai
ప్రపంచ వింతల్లో ఒకటైన చైనాగోడ దగ్గర రెగ్యులర్‌గా బాలీవుడ్ మ్యూజికల్ హిట్స్ సందడి చేస్తుంటాయట. అక్కడకు వెళ్లిన భారత పర్యాటకులకు ఇది ఒకింత ఆశ్చర్యానికి గురిచేసే విషయమే. యువతకైతే కిక్కెక్కించే సన్నివేశం. అక్కడి మ్యుటిన్యూ సెక్షన్ వద్ద ఓ మహిళ ఎప్పుడు చూసినా బాలీవుడ్ పాటలతో జనాలను హుషారు చేస్తుంటది. గతంలో తమిళ్ భాషలో మాట్లాడి వార్తల్లోకెక్కిన ఆ చైనీస్ మహిళ.. తాజాగా షారుఖ్ ఖాన్ నటించిన దిల్‌తో పాగల్ హై సినిమాలోని బోలీ సి సూరత్ పాటను ఆమిర్‌ఖాన్ నటించిన దంగల్ సినిమాలోని దంగల్ పాట పాడుతూ అందరితో స్టెప్పులేయించిందట. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో ఇండియన్ సాంగ్స్‌కు విదేశాల్లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో తెలుపుతున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

326
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles