మరక మంచిదే!


Sun,January 13, 2019 12:27 AM

పార్టీలు, ఫంక్షన్‌లకి నచ్చిన దుస్తులు వేసుకుంటాం. పార్టీల్లో భాగంగానే ఐస్‌క్రీమ్, జ్యూస్‌లంటూ అన్ని తినాలనుకుంటాం. పొరబాటున చేయి జారి బట్టలపై పడుతుంది. ఈ మరకలు అంత సులువుగా వదలవు. ఈ చిట్కాలు పాటిస్తే బట్టలపై మరకలు పోయి తిరిగి కొత్తవాటిలా మెరుస్తాయి.
clean
-షర్ట్ మీద పడ్డ చాక్లెట్ మరకలను తొలిగించడం తేలికే. ఎలా అంటే మరక ఉన్న షర్ట్‌ని డిటర్జంట్‌తో మృదువుగా ఉతుకాలి. ఆ తర్వాత చల్లని నీటిలో 15 నిమిషాల పాటు ఉంచి మళ్లీ ఉతుకాలి. దీంతో మరక వదులుతుంది.
-వేడినీటిలో వెనిగార్, డిటర్జంట్ పౌడర్‌ని వేయాలి. అందులో కాఫీ మరక ఉన్న షర్ట్‌ని నానబెట్టాలి. 15 నిమిషాల తర్వాత డిటర్జంట్‌తో బాగా ఉతుకాలి.
-బట్టలపై ఇంకు మరకలు పడితే తొలిగించడం చాలా కష్టం. బట్ట మీద ఇంక్ పడగానే టిష్యూతో తుడవాలి. మొత్తం ఇంక్ ఇంకిపోయే వరకు తుడుస్తూనే ఉండాలి. ఆ తర్వాత డిటర్జంట్‌తో ఉతుకాలి.
-గ్రీజ్ మరక పడితే దాని మీద బేబీ పౌడర్ వెయ్యాలి. గ్రీజ్‌లో ఉన్న ఆయిల్‌ని ఈ పౌడర్ పీల్చుకుంటుంది. తర్వాత 30 నిమిషాల పాటు నీటిలో నానబెట్టి డిటర్జంట్‌తో ఉతికితే సరిపోతుంది.

392
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles