మన పైలెట్లే ఎక్కువ!


Sat,September 8, 2018 11:03 PM

మహిళలు ఆకాశమే హద్దుగా రాణిస్తున్నారు. పెరిగిన చైతన్యం కారణంగా అన్ని రంగాల్లో మహిళల ప్రాధాన్యం పెరుగుతున్నది. ప్రపంచ దేశాల్లోని మహిళలతో పోల్చితే.. మన దేశానికి చెందిన మహిళా పైలెట్లే ఎక్కువగా ఉన్నట్లు జెట్ ఎయిర్‌వేస్ నిపుణులు చెబుతున్నారు.
female--pilot
విమానయాన రంగంలో ప్రపంచ వ్యాప్తంగా సగటున 5 శాతం మంది మహిళా పైలెట్లు ఉన్నారు. అయితే, ఒక్క భారతదేశంలోనే రెట్టింపు సంఖ్యలో 12 శాతం మంది మహిళా పైలెట్లు ఉన్నారు. పురుషాధిక్యత ఎక్కువగా ఉన్న రంగాల్లో ఎయిర్‌వేస్ కూడా ఒకటి. అయితే అలాంటి భిన్నమైన వాతావరణంలోనూ మహిళలు అభివృద్ధివైపు పయనిస్తున్నట్లు జెట్ ఎయిర్‌వేస్‌లో పని చేస్తున్న సీనియర్ పైలెట్ శ్వేతాసింగ్ చెబుతున్నది. పురుషులు మాత్రమే చేయగలరని ఏమీ లేదు మహిళలు కూడా అన్ని పనులు చక్కబెట్టగలరని, చేసే పనిలోనూ, తీసుకునే జీతంలోనూ ఫీమేల్ పైలెట్లు ఏమాత్రం తీసిపోరని ఆమె అభిప్రాయపడ్డారు. యూనియన్ అగ్రిమెంట్ ప్రకారం సీనియార్టీని బట్టి మాత్రమే జీతాలు ఉంటాయి కానీ, లింగ భేదాన్ని బట్టి కాదు అని అంటున్నారు శ్వేత.


రంగాల కంటే విమానయాన రంగంలోనే మహిళలకు అత్యంత రక్షణ ఉంటుందని, ఎటువంటి ఇబ్బందులు లేని జాబ్ ఉందంటే అది పైలెట్ జాబేనని శ్వేతాసింగ్ అంటున్నారు. ఆర్మీ దళాల పర్యవేక్షణలో మహిళా పైలెట్లను ఇంటి వద్ద నుంచి తీసుకొచ్చి, డ్యూటీ ముగిసిన తర్వాత ఇంటి దగ్గర దింపే సౌకర్యం ఉందంటున్నారు. గర్భిణులకు ఆఫీసులో డ్యూటీలు చేసుకొనే వెసులుబాటు కూడా ఉన్నదని అంటున్నారు. ముంబైలో ైఫ్లెయింగ్ కోర్సులకు డిమాండ్ బాగా పెరుగుతున్నది. ఇటీవల మహిళలే ఎక్కువగా ఈ రంగంలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. పదేళ్లతో పోలిస్తే ఏవియేషన్ కోర్సుల్లో చేరుతున్న మహిళల సంఖ్య 10 నుంచి 25 శాతానికి పెరిగింది.

744
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles