మన్నించి..చెల్లించి


Thu,January 24, 2019 11:53 PM

goair
జయేష్ పాండ్యా 2014 మేలో గో ఎయిర్ విమానంలో 25 టికెట్లు బుక్ చేశాడు. అహ్మదాబాద్‌లో తన కూతురి పెళ్లి కోసం వచ్చే అతిథుల కోసం ఆ టికెట్లు. ఆరు నెలల ముందు టికెట్లు బుక్ చేస్తే అన్నింటికీ కలిపి సుమారు యాభై వేల రూపాయలయ్యాయి. ఎలాంటి కారణం లేకుండా విమానయాన సంస్థ విమానాన్ని ఆ రోజు రద్దు చేసింది. పాండ్యా ఏదోలా వాళ్లందరినీ పెళ్లికి వచ్చే ఏర్పాట్లు చేయించాడు. ఈ విషయం మీద రెండు మూడుసార్లు ఆ సంస్థకు ఫిర్యాదు చేశాడు. ఎవరూ పట్టించుకోలేదు. రెండో సారి ఫిర్యాదు చేసినప్పుడు మూడు వేల రూపాయల విలువైన వోచర్ ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. పాండ్యా ఈ సారి ఆర్టీఐకి ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు కస్టమర్ ఫోరం దాకా వెళ్లింది. క్యాన్సలేషన్ సమాచారం మెయిల్ ద్వారా వచ్చింది. గో ఎయిర్ సంస్థ అతనికి యాభై వేలతో పాటు ముప్ఫై ఎనిమిదివేల రూపాయలు అదనంగా తిరిగి చెల్లించింది.

457
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles