మనసున్న మారాణి


Sat,December 22, 2018 11:20 PM

ఈమెకు కన్నీటి విలువ తెలుసు. ఆకలి మంటలు.. అన్నార్థుల గాథలు తెలుసు. తోటివారిని ప్రేమించలేని, సాటి మనిషికి సాయం చెయ్యలేని జీవితం ఎందుకనే ఫిలాసపీ తనది. అందుకే.. మిస్ వియత్నాం టైటిల్ గెలువగా వచ్చిన డబ్బును పేద ప్రజలు, విద్యార్థులకు ఖర్చు పెడుతున్నది.
MIss-Viathnam
ఈ ఏడాది మిస్ యూనివర్స్ వియత్నాం కిరీటం గెలుచుకున్నది హెచ్.హెన్ నియి. ఇప్పుడంతా ఆమె చేసిన గొప్ప మంచి పని గురించే చర్చించుకుంటున్నారు. ఎందుకంటే హెన్ తనకు ప్రైజ్ మనీగా వచ్చిన డబ్బునంతా పేదలు, విద్యార్థులు, లైబ్రరీల నిర్మాణం, అనాథల కోసం ఖర్చు చేస్తున్నది కాబట్టి. ఆ మొత్తం విలువ దాదాపు 7 లక్షల రూపాయలుపైనే. తాను పేదల సంక్షేమం కోసం డబ్బును ఎలా ఖర్చు పెడుతుందో.. ఓ వీడియోను రూపొందించి తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేసింది. ఆ వీడియోకు 7 మిలియన్ వ్యూస్ వచ్చాయి. హెన్ ఎప్పుడూ ఆడంబరంగా ఉండదు. సామాన్యులు, పేదలతో కూడా చాలా ఈజీగా కలిసిపోతుంది. వృద్ధులు, వికలాంగులు, అంధులకు చేతనైన సాయం చేస్తుంది. అంతేకాకుండా తాను చేసిన ఏ పనికైనా డబ్బులొస్తే.. వాటిని కూడా పేదల సంక్షేమానికి ఖర్చు చేస్తుంది హెన్. ఎందుకంటే ఆమె కష్టాలు తెలిసిన మనిషి. చిన్నప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని నేడు ఈ స్థాయికి చేరుకున్నది. ఆరుగురు సంతానంలో తనే చిన్నది. ఆమెకు 14 యేండ్ల వయసులోనే పెండ్లి చేసేందుకు సిద్ధపడ్డారు ఆమె తల్లిదండ్రులు. 2014 నుంచి మోడల్‌గా రాణిస్తున్నది. 2015లో నిర్వహించిన వియత్నాం నెక్ట్స్ టాప్ మోడల్ పోటీల్లో 9వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఎంతో కష్టపడి.. ఈ ఏడాది నిర్వహించిన మిస్ యూనివర్స్ వియత్నాం పోటీల్లో కిరీటాన్ని సొంతం చేసుకున్నది.

520
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles