మధుర జ్ఞాపకాల.. 10 ఇయర్స్ చాలెంజ్


Tue,January 22, 2019 10:43 PM

సోషల్‌మీడియాలో ఇప్పుడు ఏం నడుస్తున్నది? 10 ఇయర్స్ చాలెంజ్ నడుస్తున్నది. ఎవ్వరి ఫేస్‌బుక్ చూసినా.. వాట్సప్ స్టేటస్‌లు చూసినా.. ఇన్‌స్టాగ్రామ్ అప్‌డేట్స్ చూసినా.. ఈ చాలెంజే మెరిసిపోతున్నది. ఏంటీ పదేళ్ల మధుర జ్ఞాపకాల చాలెంజ్? దీనిని ఎవరు కనిపెట్టారు? ప్రయోజనం ఏంటి?
mark-zuckerberg
ప్రపంచవ్యాప్తంగా సోషల్‌మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న చాలెంజ్ #10YearsChallenge. ఇందులో పిల్లలు.. పెద్దలు అందరూ భాగస్వామ్యం అవుతున్నా యూత్ పార్టిసిపేషనే ఎక్కువగా కనిపిస్తున్నది.


ఎందుకు?: పదేళ్ల క్రితం తాము ఎలా ఉన్నామో.. ఇప్పుడు ఎలా మారామో తెలియజెప్పడానికే ఈ చాలెంజ్. దీనిని 2009VS 2019 చాలెంజ్, గ్లోఅప్ చాలెంజ్‌గా పిలుస్తున్నారు.


స్పందన ఎలా ఉంది?: చాలెంజ్ మొదలైన 3 రోజుల్లోనే 52 లక్షల మందికిపైగా తమ ఫొటోలను షేర్ చేశారంటే ఏ రేంజ్‌లో రియాక్ట్ అవుతున్నారో అర్థం చేసుకోవచ్చు.


ఎలా మొదలైంది?: ఎవరు మొదలుపెట్టారన్న దానిపై స్పష్టత లేదు. అయితే ఫేస్‌బుక్ చూపించే మెమరీస్ స్ఫూర్తితో ఇది మొదలై ఉంటుందని భావిస్తున్నారు నెటిజన్లు.


ఎవరు పాల్గొన్నారు?: సామాన్యులతో పాటు సెలెబ్రిటీలు కూడా ఈ చాలెంజ్‌లో భాగస్వాములవుతున్నారు. శ్రుతిహాసన్, కరణ్ జోహార్, శిల్పా శెట్టి, సోనమ్ కపూర్, రవిచంద్రన్ అశ్విన్ లాంటి చాలామంది భారతీయులు వారిలో ఉన్నారు. తొందరగా కామన్‌మ్యాన్‌కు కూడా దగ్గరైంది.


మధుర జ్ఞాపకాలే: కేవలం అందానికే ప్రాధాన్యమిస్తూ చాలామంది తమ అందాన్ని చూపించుకునేందుకే ఈ చాలెంజ్‌లో పాల్గొంటున్నారనే విమర్శలూ వస్తున్నాయి. అయినా సెలబ్రిటీలు దీనిని ఆదరిస్తున్నారు.


ఎవరేమన్నారు?: రోహిత్‌శర్మ తన ఒక ఫొటోను షేర్ చేస్తూ బాగా ఆందోళన కలిగిస్తున్న 10 ఇయర్స్ చాలెంజ్ ఇదే అని పోస్ట్ చేయగా.. రాశీఖన్నా అప్పుడు నన్ను చాలామంది వెక్కిరించేవాళ్లు. కానీ నన్ను నేను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా అని రాసుకొచ్చారు.


సమస్యలూ ఉన్నాయి: ఈ చాలెంజ్ దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్నాయని సైబర్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగే ప్రమాదం ఉంది. ఫొటోల మార్ఫింగ్‌కు కూడా అవకాశం ఉండటంతో ఫొటోలు షేర్ చేసేటప్పుడు ఆచితూచి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

488
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles