మచ్చలు మాయం


Thu,January 3, 2019 12:40 AM

గాయాలు క్రమంగా మచ్చలుగా ఏర్పడుతాయి. కొన్ని మచ్చలు అలానే ఉండిపోతాయి. వాటిని తొలిగించడానికి కొన్ని చిట్కాలను పాటించండి.
skincare
-పసుపు, తేనె, చక్కెరని సమపాళ్లలో కలుపాలి. ఈ మిశ్రమాన్ని మచ్చలు ఉన్న ప్రదేశంలో రాయాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచాలి. కొన్నిరోజులు ఇలానే చేస్తే మచ్చలు పోతాయి.
-కలబంద గుజ్జు, రోజ్‌వాటర్ రెండింటినీ కలుపాలి. ఈ మిశ్రమాన్ని కాలిన చర్మానికి రాయాలి. 20 నిమిషాల తరువాత నీటితో శుభ్రం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే మచ్చలు తొలిగిపోతాయి.
-పాలు, పసుపుని కలుపాలి. దూదిని ఈ మిశ్రమంలో ముంచి కాలిన మచ్చలున్న ప్రదేశంలో రాయాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడుగాలి. తరచూ ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
-టమాట గుజ్జు, పెరుగు, గుడ్డు తెల్లసొనని బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని వేళ్లతో మచ్చలకి రాయాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. రోజుకి రెండుసార్లు చేస్తే త్వరగా మచ్చలు తొలిగిపోతాయి.

714
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles