మంచుతో సింగారించుకున్న చలికాలపు సౌందర్యాలు


Fri,December 28, 2018 01:23 AM

సాధారణంగా పర్యాటక ప్రాంతాల సందర్శనకు వేసవికాలాన్నే మనం ఎక్కువగా ఎంచుకుంటాం. కానీ కొన్ని ప్రాంతాలను చలికాలంలో సందర్శిస్తేనే అందంగా ఉంటాయి. మంచుతో కూరుకుపోయిన ఎత్తైన కొండలను, కొన ఒంపులు తిరిగిన రోడ్ల గుండా దాటుకుంటూ వెళ్తుంటే కలిగే ఆ అనుభూతే వేరు. మంచు దుప్పట్లు కప్పుకున్న ప్రకృతి అందాల వీక్షణం మనల్ని మరో లోకంలోకి తీసుకువెళ్తాయి. ఈ చలికాలపు సౌంద ర్యాలను చూస్తే ఎవరైనా దాసోహం అవాల్సిందే. మంచుతో సింగారించుకున్న ఈ అందాలను మనమూ ఒక్కసారి చూసొద్దామా? ఆ మంచు పరదాల చాటున స్కెయింగ్, స్కేటింగ్, ట్రెక్కింగ్ చేసి వద్దమా?
thajiswar

నైనిటాల్

ఉత్తరభారతంలోని పర్యాటక ప్రాంతాల్లో అన్నింటికంటే ముందు వరుసలో ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ నిలబడుతుంది. ఇక్కడి సరస్సులు, వన్యప్రాణి కేంద్రాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. సముద్ర మట్టానికి 1938 మీటర్ల ఎత్తున ఉన్న ఈ చిన్నపట్టణంలో బోటింగ్, ట్రెక్కింగ్, ఫిషింగ్ క్రీడలు అందుబాటులో ఉన్నాయి.

కనటాల్

దేశంలోని పర్యాటక ప్రాంతాల జాబితాలో డెహ్రాడూన్‌కు 78 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామానికి విశిష్ఠ స్థానం ఉంది. ఏకాంతాన్ని కోరుకునే వాళ్లు ఇక్కడికి ఎక్కువగా వస్తూ ఉంటారు.

సిమ్లా

సిమ్లాని క్వీన్ ఆఫ్ హిల్స్‌అంటారు. హిమాచల్ ప్రదేశ్ రాజధాని కూడా కావడంతో ఇక్కడ అన్ని వసతులు లభిస్తాయి. రకరకాల దుకాణాలతో నిండిన సిమ్లా వీధులు మంచి షాపింగ్ అనుభూతిని మిగులుస్తాయి.
dharamshala

డల్హౌసీ

హిమాచల్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో డల్హౌసీ ఒకటి. డల్హౌసీ, కత్లోగ్, పోర్ట్‌రేన్, తెహ్ర, బక్రోట అనే ఐదు కొండల మీద ఈ పట్టణాన్ని నిర్మించారు. ఇక్కడి వాతావరణం సంవత్సరం పొడవునా ఆహ్లాదంగా ఉంటుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల నుంచి -1 డిగ్రీ మధ్యలో ఉంటాయి. సముద్ర మట్టానికి 2700 మీటర్ల ఎత్తులో ఉండడం వల్ల భారీగా మంచు కురుస్తుంది.

గుల్మార్గ్

కాశ్మీరంలోని సుందర ప్రదేశాల్లో అన్నింటికంటే పేరుగాంచింది గుల్మార్గ్. ఇక్కడి అందాలను వర్ణించడానికి మాటలు చాలవు. గుల్ అంటే పువ్వులు, మార్గ్ అంటే పచ్చిక బయళ్ళు. గుల్మార్గ్ అంటే పువ్వులతో కూడిన పచ్చిక బయళ్ళు అని అర్థం. ఒకవైపు మంచుతో నిండిన కొండలు, మరోవైపు ఆకాశంలోకి నిటారుగా ఎదిగిన ఎత్తైన చెట్లు మైమరిపిస్తాయి. ఇక్కడి కేబుల్ కారు విహా రం చక్కటి అనుభూతినిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గోల్ఫ్ క్రీడా మైదానం ఇక్కడి ప్రత్యేకత.
NARKANDA

ధర్మశాల

బుద్ధిజం చాలా ప్రబలంగా ఉండే ప్రాంతాల్లో ధర్మశాల ఒకటి. దలైలామా హెడ్ క్వాటర్ కూడా ఇక్కడే ఉంది. ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఇష్టపడే వాళ్లు ఇక్కడికి రావొచ్చు. కాంగ్రా జిల్లాలోని కాంగ్రావ్యాలి అందాలు చూడముచ్చట గొలుపుతాయి.

డార్జిలింగ్

ప్రకృతి.. తన అందాలను ఆరబోసిన ప్రదేశం డార్జిలింగ్. ఇది పశ్చిమబెంగాల్‌లో ఉంటుంది. సముద్రమట్టానికి ఏడువేల అడుగుల ఎత్తున కాంచనగంగ పర్వత శ్రేణుల్లో డార్జిలింగ్ ఉంది. కొండా కోనల గుం డా సాగే ఇక్కడి రైలు ప్రయాణం మొత్తం టూర్ కే హైలైట్‌గా నిలుస్తుంది. ట్రెక్కింగ్‌కు చాలా అనువైన ప్రాంతం. మిగతా చోట్ల కంటే ఇక్కడ సూర్యాస్తమయం ప్రకాశవంతంగా ఉంటుంది. డార్జిలింగ్ అందాలను రోప్ వే సాయంతో చూస్తే ఆ మజానే వేరు. డార్జిలింగ్‌లో టీ తోటలు మరొక అట్రాక్షన్.

మున్సియారీ

ఉత్తరాఖండ్‌లోని అత్యద్భుతమైన పర్వత ప్రాంతాల్లో మున్సియారి ఒకటి. భారత్, నేపాల్ సరిహద్దుల్లో ఇది ఉంది. శీతాకాలంలో మంచు కారణంగా ఇక్కడ బాహ్య ప్రపంచంతో సం బంధాలు తెగిపోతాయి. ఇక్కడి పచ్చటి కొండలు, మంచుతో కప్పబడిన హిమాలయాలు, దక్షిణ దిశగా వీటి వెనుక ఉన్న డూన్‌వాలీ మంత్ర ముగ్ధులను చేస్తాయి.
dalhousie

స్పిటీ వ్యాలీ

హిమాలయాల్లోని అత్యంత చల్లనైన ప్రాంతాల్లో స్పిటీ వ్యాలీ ఒకటి. ఇది అటు టిబెట్‌కు ఇటు భారత్‌కు సరిగ్గా మధ్యలో ఉంటుంది. బౌద్ధ మతాన్ని మెజార్టీ ప్రజలు అవలంబిస్తున్నారు. ఈ వ్యాలీని రోహ్‌తంగ్‌పాస్ కొండలు చుట్టు ముట్టి ఉంటాయి. మంచు కారణంగా ప్రతీ ఏటా సుమారు 8 నెలల పాటు బాహ్యప్రపంచంతో ఈ వ్యాలీకి సంబంధాలు తెగిపోతాయి.

సోన్ మార్గ్

కశ్మీర్లోని మరో సుందర ప్రాంతం సోన్‌మార్గ్. పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తున్న ప్రాంతాల్లో ఇది ఒకటి. ఇక్కడి గ్లేసియర్లను(హిమనీనదాలు) చూసేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు.

ఔలీ

మంచులో మునిగి తేలాలి అని అంటే ఔలీని చలికాలంలో సందర్శించాలి. హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాం తం పూర్తిగా మంచుతో నిండి ఉండి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది.
Cover12

గ్యాంగ్‌టక్

మంచులో అన్ని రకాల ఆటలు ఆడుకోవాలంటే సిక్కింలోని గ్యాంగ్‌టక్‌కు వెళ్లాల్సిందే! మిగతా పర్వత ప్రాంతా ల్లా కాకుండా ఇక్కడ అన్ని వసతులూ ఉన్నాయి. రివర్ రాఫ్టింగ్, యాక్ సఫారీ, పారాగ్లయిడింగ్, రోప్ వే కేబుల్ రైడ్ , ట్రెక్కింగ్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

నర్ఖండా

ఇది కూడా హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లా జిల్లాలో ఉండే ప్రాంతం. స్వచ్ఛమైన గాలికి, నిర్మలమైన వాతావరణానికి నర్ఖండా పెట్టింది పేరు. ట్రెక్కింగ్ చేసే వాళ్లలో చాలామంది ఈ ప్రాంతాన్ని ఇష్టపడుతారు.

ఖజ్జార్ సరస్సు

ఎత్తైన కొండల మధ్య సరస్సును ఇష్టపడే వారికి హిమాచల్‌ప్రదేశ్‌లోని ఖజ్జార్ సరస్సు బాగా నచ్చుతుంది. చు ట్టూ కేదార్ అడవులు ఇక్కడి అందాలకు మరింత వన్నె తెస్తాయి. కాలాటాప్ వైల్డ్‌లైఫ్ శాంచురీని చూడొచ్చు.

మధుకర్ వైద్యుల

537
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles