మంచుతో మహావిష్ణువు!


Sun,February 17, 2019 01:38 AM

మంచుపై శిల్పాలు చెక్కి, దేశానికే ఎనలేని గౌరవాన్ని తెచ్చిపెట్టారు మనోళ్లు. హిందువుల ఆరాధ్య దైవం మహావిష్ణువు శిల్పాన్ని మంచుతో చెక్కి ఫస్ట్ ప్రైజ్ కొట్టేశారు. జపాన్‌లోని నయారోలో అంతర్జాతీయ శిల్పకళ పోటీ ఇందుకు వేదికైంది.
Silpam
ఇండియాకు చెందిన రవి ప్రకాశ్, సునీల్ కుమార్ కుష్వా, రాజ్నిష్ వర్మ మంచు శిల్పాల కళాకారులు. వీరు ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జపాన్‌లోని నయారోలో జరిగిన మంచు శిల్పాలు చెక్కే పోటీల్లో పాల్గొని మొదటి బహుమతి సాధించారు. పోటీల్లో మహా విష్ణువు అవతారాన్ని మంచుతో చెక్కి అందరి దృష్టిని ఆకర్షించారు. తద్వారా అంతర్జాతీయ స్థాయిలో భారతీయుల ఖ్యాతిని ఉన్నత స్థానంలో నిలిపారు. మైనస్ 25 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే మంచులో వీరు విష్ణుమూర్తి మంచు శిల్పాన్ని చెక్కారు. 19 యేండ్లుగా నిర్వహస్తున్న అంతర్జాతీయ మంచు శిల్పాల పోటీల్లో ఇప్పటివరకూ భారత్ నుంచి ఏ ఒక్కరూ పోటీ పడలేదు. తొలిసారి ఇండియా నుంచి ఈ పోటీలో పాల్గొని.. మొదటి బహుమతి సాధించారు. పోటీలో భాగంగా ఈ ముగ్గురు విష్ణువు పది అవతారాల్లో వరాహ అవతారం, ఉగ్రనరసింహ అవతారం వంటి ఎన్నో మంచు శిల్పాలను రూపొందించి భారత్ తరపున ఫస్ట్ ఫ్రైజ్ గెలుచుకున్నారు. ఈ పోటీలో మొత్తం 10 ప్రపంచ దేశాలు పోటీ పడగా.. మొదటి ఫ్రైజ్ ఇండియాను వరించింది. రష్యా రెండోస్థానంలో, థాయిలాండ్ టీమ్ మూడో స్థానంలో నిలిచాయి.

561
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles