భూములు కొనేందుకు రుణమివ్వాలి!


Sat,March 9, 2019 12:13 AM

-హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ ఎండీ రేణుసూద్ కర్నాడ్
land
స్థలాలను కొనేందుకు అవసరమయ్యే ఆర్థిక సాయాన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు డెవలపర్లకు అందించాలి. అప్పుడే, దేశవ్యాప్తంగా ఇండ్ల ధరలు తగ్గుముఖం పడతాయని హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ ఎండీ రేణుసూద్ కర్నాడ్ అభిప్రాయపడ్డారు. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన క్రెడాయ్ యూత్‌కాన్ సదస్సులో ఆమె మాట్లాడుతూ.. ఇండ్ల ధరలు తగ్గుముఖం పట్టాలంటే.. డెవలపర్లకు భూముల ధరలు నామమాత్రపు రేటుకే అందించాలన్నారు. ప్రస్తుతం అధిక శాతం డెవలపర్లు ప్రైవేటు ఈక్విటీ సంస్థలు, ప్రైవేటు వ్యక్తుల ద్వారా భూముల్ని కొనుగోలు చేస్తున్నాయని తెలిపారు. దీని వల్ల డెవలపర్లు భూముల కోసం అధిక వడ్డీ చెల్లిస్తున్నారని చెప్పారు. కొనుగోలుదారుల్లో ఆత్మవిశ్వాసం పెరిగినప్పుడే ఇండ్ల అమ్మకాలు పెరుగుతాయన్నారు. రెరా వల్ల వీరి ఆలోచనల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ఇండ్ల కొనుగోలుదారులు పాత ఇండ్లను కొనుగోలు చేయడానికి ముందుకొస్తున్నారని.. వీటిపై అధిక శాతం రుణం లభించడమే ప్రధాన కారణమన్నారు.

-ప్రధానమంత్రి ఆవాస్ యోజన విభాగానికి మనదేశంలో ఆదరణ గణనీయంగా పెరుగుతున్నదని, నిరుపేదలు, సామాన్య, మధ్యతరగతి ప్రజానీకం సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి ముందుకొస్తున్నారని చెప్పారు. అల్పాదాయ, సామాన్యులు మొదటిసారి ఇండ్లను కొనుక్కునేందుకు గతేడాది సుమారు రూ.11,297 కోట్ల రుణాన్ని మంజూరు చేశామన్నారు. ఇందులో మొత్తం సబ్సిడీయే రూ.1,472 కోట్లు అని వెల్లడించారు. ఇతర రుణాలతో పోల్చితే గృహరుణాల్లో నిరర్థక ఆస్తులయ్యే శాతం తక్కువని అభివర్ణించారు.

268
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles