భీష్ముని భక్తి బాటలో..ఇలా చేద్దాం


Fri,February 15, 2019 01:37 AM

Ila-cheddam
మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా జరుపుకుంటాం. భారతీయులు గర్వించదగ్గ మహోన్నతుడు భీష్మ పితామహుడు. ఆయన పేరుమీద జరుపుకొనే పర్వదినమిది. ఈ సందర్భంగా అంత గొప్ప భక్తుని భక్తిలోంచి అణువంతైనా మనం పొందితే మన జన్మ ధన్యమైనట్టే. సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశుల్లోకెల్లా విలక్షణమైన ఏకాదశిగా ధర్మశాస్ర్తాలు దీనిని పేర్కొన్నాయి. ప్రతీ ఏకాదశి విష్ణుమూర్తికి ప్రీతికరం. కానీ, ఇదొక్కటి భీష్మునికే అంకితం. భీష్మాష్టమి నుంచి భీష్మద్వాదశి వరకు 5 రోజులు భీష్మ పంచకంగా పిలుస్తారు. ఆ మహనీయుని భక్తిబాటలోకి వెళ్లిన వారికి ఎంతో పుణ్యం కలుగుతుందని వేద పండితులు అంటారు. ఆజన్మ బ్రహ్మచారి, తండ్రి కోసం జీవితాన్నే అంకితం చేసిన మహాయోధుడు, కౌరవుల పక్షాన నిలిచిన పాపానికి 58 రోజులపాటు అంపశయ్యపై ప్రాయశ్చిత్తాన్ని అనుభవించాడు. ఈ పండుగ వేళ భీష్మునికి తిలోదకాలు వదిలితే (తండ్రి వున్నవారైనా సరే) ముఖ్యంగా సంతానం లేని వారికి అది సంప్రాప్తించే అవకాశం ఉంటుందని శాస్ర్తాలు చెప్పాయి. ఇంకా, వెయ్యి నామాలతో శ్రీ కృష్ణ పరమాత్మను స్తుతించిన ఆ పితామహునికి అదే బాటలో మనమూ విష్ణుసహస్ర నామాలను భీష్మ ఏకాదశి రోజున పారాయణం చేసి పుణ్యాత్ములం అవుదాం.

891
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles