భిక్షమెత్తి చదివిస్తే.. జాతీయస్థాయికి ఎదిగింది!


Wed,February 20, 2019 01:20 AM

డాక్టర్ కూతురు డాక్టర్ అవుతుంది. బిచ్చగాడి కూతురు బిచ్చగత్తె అవుతుందని అంటుంటారు. కానీ ఆ మాటలను తిరుగరాసి అంచెలంచెలుగా ఎదిగి ఆ అమ్మాయి జాతీయ స్థాయిలో బాస్కెట్ బాల్ ప్లేయర్ అయింది. అందరితో శెభాష్ అనిపించుకుంటున్నది.
anu
జార్ఖండ్‌లోని రాంచీకి చెందిన 16 యేండ్ల అను ఓరాన్ బాస్కెట్‌బాల్ ప్లేయర్‌గా రాణిస్తున్నది. ఆర్థిక సమస్యల నుంచి కుటుంబాన్ని బయటకు తీసుకొస్తానని చాలెంజ్ చేస్తున్నది. దంబాద్‌లోని నిర్మలా స్కూల్‌లో పదో తరగతి పూర్తిచేసి, ఇంటర్మీడియట్ గురుగోవింద్ పబ్లిక్ స్కూల్లో స్కాలర్‌షిప్‌తో చదువుతున్నది. చూడ్డానికి అన్ని సౌకర్యాలు ఉన్న అమ్మాయిలా కనిపించినా ఆ పెదాల నవ్వు వెనుక ఉన్న కన్నీటి గాథ ఎవరికీ తెలియదు. ఒక డాక్టర్ తన కొడుకుని డాక్టర్ చేయగలడు. ఇంజినీర్ తన కూతుర్ని ఇంజినీర్ చేయగలడు. మరి ఒక బిచ్చగాడు తన కూతుర్ని ఏం చేస్తాడు? బిచ్చగత్తె తప్ప మరో ఆలోచన రాదు. అను తల్లిదండ్రులు మాత్రం బిచ్చమెత్తుతూ బిడ్డలను చదివిస్తున్నారు. అను తండ్రి తన్వ ఓరాన్ కుష్టు వ్యాధితో బాధపడుతున్నాడు. తల్లి బేబీకి ఎడమకాలు పనిచేయదు. మా తల్లిదండ్రులు మా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. వారికి భవిష్యత్‌లో మంచి జీవితాన్నివ్వాలనే సంకల్పంతోనే ముందుకు సాగుతున్నా అంటున్నది ఓరాన్. తనకి ఆర్మీలో చేరాలని కల. 2015లో ఏడవ తరగతిలో ఉన్నప్పుడు క్రీడల్లో పాల్గొనమని పిలుపు వచ్చింది. బాస్కెట్‌బాల్ గురించి అవగాహన లేని అను శిక్షణ తీసుకొని అందులో ప్రావీణ్యం పొందింది. 2018లో జూనియర్, సీనియర్ నేషనల్ చాంపియన్‌షిప్‌లో అవకాశం లభించింది. తన ప్రతిభను గుర్తించడంతో బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ద్వారా నెలవారీ 18 శిక్షణ శిబిరాల కోసం బెంగళూరుకి వెళ్లింది. అను దేశం గర్వించే స్థాయికి ఎదుగుతుందని ట్రైనర్ కరోల్ సమంతా చెబుతున్నది.

341
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles