భార్యకు ప్రేమతో..!


Thu,January 10, 2019 01:09 AM

ఈ సృష్టిలో ప్రేమకు ఎవ్వరూ సరైన నిర్వచనం ఇవ్వలేరు. ఎందుకంటే ప్రేమ అజరామరం. అదొక ఫీలింగ్. క్షణకాలంలో మొదలై.. జీవితాంతం వరకూ ఉంటుంది స్వచ్ఛమైన ప్రేమ. అందుకే కాబోలు.. తన భార్యను బతికించుకునేందుకు ఈ ప్రేమికుడు దేశమంతా తిరుగుతున్నాడు.
Old-Love
ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవ్వరికీ అంతుబట్టదు. కోల్‌కతాకు చెందిన 75 యేండ్ల స్వపన్ సేఠ్ మనసులో ఈ ప్రేమ ఎప్పుడు చిగురించిందో తెలియదు కానీ, భార్యంటే అమితమైన ప్రేమ. ధర్మేచా.. అర్థేచా.. కామేచా.. నాతి చరామి అంటూ నాడు పెళ్లి సమయంలో పలికిన మాటలకు నేటికీ కట్టుబడే ఉన్నాడు స్వపన్ సేఠ్. క్యాన్సర్‌తో బాధపడుతున్న తన భార్యను బతికించుకోవడానికి ఈయన చేస్తున్న ప్రయత్నాలు తెలిస్తే.. మీ హృదయం తపించకమానదు. వృద్ధాప్యంలో కూడా తనకు ఇష్టమైన వయొలిన్ వాయిస్తూ.. భార్యను బతికించుకునేందుకు విరాళాలు సేకరిస్తున్నాడు స్వపన్ సేఠ్. ఇందుకు దేశమంతా తిరుగుతున్నాడు. ఆయన భార్య పూర్ణిమ 2002లో గర్భాశయ కేన్సర్ బారిన పడింది. అప్పటి నుంచి భార్యను ఎలాగైనా కాపాడుకోవాలని వయొలిన్ వాయిస్తూ.. డబ్బులు సేకరిస్తున్నాడు. భార్యను బతికించాలన్న ఆయన తపన చూస్తుంటే ప్రపంచమంతా ఒక్కటై ఎదురు నిలవనీ.. ఆకాశం విరిగిపడి మన్నూ మిన్నూ ఒక్కటవనీ.. కాలయముడే వచ్చి మరణమే ముంగిట నిలవనీ.. నీతోనేనుంటా.. నీకై నేనుంటా.. అన్న మాటలు గుర్తొస్తున్నాయి.

998
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles