భామ కాదు, బామ్మ!


Mon,January 21, 2019 12:00 AM

వయసు అయిపోయిందని కొందరు బాధపడుతూ కూర్చుంటారు. ఇంకొందరు మాత్రం వయస్సును లెక్క చేయకుండా ఇష్టమైన పనులు చేసుకుంటూ ఆనందిస్తారు. అలానే చేసింది చైనాకు చెందిన ఓ వృద్ధురాలు.. అన్నట్టు ఆమె చేస్తున్న పని చూస్తే వృద్ధురాలు అనలేం..
old-lady-pole-dancer
రిటైర్మెంట్ తర్వాత ఎవరైనా ఏం చేస్తారు? ఇంటిపట్టున ఉండి సరదాగా కాలక్షేపం చేస్తారు. వయసైపోయిందంటూ చిన్న చిన్న పనులతో కాలం వెల్లదీస్తారు. కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి అసలే ఆసక్తి చూపారు. కానీ చైనాకు చెందిన 73 యేండ్ల డయ్‌డాలి అనే ఆవిడ గురించి వింటే ఆశ్చర్యమేయక మానదు. పదిహేనేండ్ల నుంచి పోల్ డ్యాన్స్‌లో వినూత్న ప్రతిభ చూపుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నది. డాలీ 65వ యేట బుక్ స్టోర్ ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ తీసుకుంది. తర్వాత ఖాళీగా ఉండడం ఇష్టపడలేదు. ఏదైనా కొత్తగా నేర్చుకొని సమయాన్ని వినియోగించుకోవాలనుకుంది. మొదట ఓ డ్యాన్స్ స్కూల్‌లో చేరాలని నిర్ణయించుకుంది. ఫోక్, జాజ్‌లో ఆమె ఆసక్తి చూపింది. ఈ వయస్సుల్లో డ్యాన్స్ అంటే ఆరోగ్యంగానూ, కావాల్సిన శక్తి కూడా అవసరం అని తెలుసుకుంది. తర్వాత ఫిట్‌నెస్‌పైనా దృష్టి సారించింది. దీంతో ఆమె అభిరుచి పోల్ డ్యాన్స్‌వైపు మళ్లింది. మొదట కష్టంగా ఉన్నా నిరంతర శిక్షణ అనంతరం పోల్ డ్యాన్సర్ అయింది. అప్పటి నుంచే వివిధ సందర్భాల్లో ప్రదర్శనిలిచ్చింది. 2012లో చైనా గాట్ ట్యాలెంట్‌లో ఆమె పాల్గొన్నది. అనంతరం అమెరికాలో ఆసియా గాట్ ట్యాలెంట్ లో నుంచి కూడా మన్ననలు పొందింది. నాకు గాల్లో ఎగరడం, పోల్ చుట్టూ తిరగడం ఎంతో ఆనందాన్ని ఇస్తాయి... లక్ష్యాన్ని చేరుకోవడానికి వయస్సును ఎవరూ లెక్క చేయొద్దు అంటూ ఆమె ఎందరినో ఆశ్చర్యపరుస్తున్నది.

512
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles