భవిష్యత్‌కు బాటలు వేస్తున్నది


Fri,March 1, 2019 01:43 AM

తల్లిదండ్రులకు తను ఒక్కతే కూతురు. మారుమూల గ్రామం. బీడీలు చుడుతూ జీవనం సాగించే కుటుంబం. మొదటిసారి చదివిన ఓ పుస్తకం తన జీవితాన్నే మార్చేసింది. పేదరికపు అడ్డంకులను తొలగించుకొని కష్టపడి ఇప్పుడు ఆదర్శంగా నిలుస్తున్నది..
shetti
తమిళనాడులోని ముక్కుదల్ గ్రామానికి చెందిన బీడీ కార్మికుల కుటుంబంలో జన్మించింది అశ్విత శెట్టి. తల్లిచాటు బిడ్డలా బతికింది. గవర్నమెంట్ పాఠశాలలోనే చదవింది. తను 13వ యేట చదివిన హెలన్ కెల్లర్ పుస్తకం తనను పూర్తిగా ప్రభావితం చేసింది. హెలెన్‌ది కూడా తన లాంటి పరిస్థితే అనే తనకు తాను ప్రేరణ పొందింది. మరిన్ని పుస్తకాలను చదవటం మొదలు పెట్టింది. ఇలా బీడీలు చుట్టడంలో తల్లికి సాయం చేస్తూనే పుస్తకాలను చదివేది. క్రమంగా ఆడపిల్లల చదవు ప్రాముఖ్యాన్ని గుర్తించింది. రూరల్ ఏరియాల్లో అందరికీ విద్య అందాలి అంటే తానే చొరవ తీసుకోవాలి అనుకుంది. అంతకన్నా ముందు తను ఇంకా ఉన్నత చదువులు చదవాలని అనుకుంది. కానీ పేదరికం అడ్డం వచ్చింది. దీంతో యంగ్ ఇండియా ఫెలోషిప్‌కు దరఖాస్తు చేసుకుంది. ఇంటర్వ్యూ ఎదురోవడానికి కష్టాలే అనుభవించింది.

ఇంటర్వ్యూను జయించాలంటే ఇంగ్లీష్ కచ్చితంగా తెలిసి ఉండాలి. కానీ మాతృభాషతోనే పెరిగిన అశ్వితకు ఇంగ్లీష్ అంటే భయం. కానీ ఇంటర్వ్యూ కోసం ఇంగ్లీష్ మాట్లాడటం సాధన చేసింది. ఇతరులతో మాట్లాడటానికి ఇంగ్లీష్ వచ్చిన వారు లేకపోయినా తనకు తాను మాట్లాడుకునేది. చివరికి ఇంటర్వ్యూలో ఇంగ్లీష్ మాట్లాడి తానే ఆశ్చర్యపోయింది. యంగ్‌ఇండియా ఫెలోషిప్‌కు ఎంపికైన అశ్విత ఉన్నత చదువుల కోసం ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. ఎప్పుడూ ఇల్లు దాటని ఆమె ఏకంగా తల్లిదండ్రులను విడిచి అక్కడికి వెళ్లింది. తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వద్దన్నారు. కానీ అశ్విత వాళ్లకు నమ్మకాన్ని కల్పించింది. ఆమెకూ భయమే ఉంది కానీ సంకల్పం ముందు ఆ భయం పారిపోయింది. ఢిల్లీ వెళ్లి చదవుకుంది. ఇప్పుడు మళ్లీ స్వగ్రామానికి తిరిగి వచ్చి రూరల్ ఏరియాల్లో ఉన్న విద్యార్థులకు అశ్విత ఒక మార్గదర్శకురాలిగా ఉంది. బోధి ట్రీ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి రూరల్ ప్రాంతాల్లో గ్రాడ్యుయేట్స్‌ను ప్రోత్సహించాలని కృషి చేస్తుంది. ఉత్సాహవంతులతో, విద్యావంతులతో కమ్యూనిటీలు ఏర్పాటు చేసి అభివృద్ధికి తోడ్పాటును అందిస్తుంది. ఇప్పుడు ఆమె ఫౌండేషన్ ఆధారంగా సుమారు 2400 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.

602
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles