భరోసా కల్పిస్తే చాలు


Tue,September 12, 2017 11:12 PM

మా అబ్బాయి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. రాత్రంతా నిద్రపోడు. ఎక్కువ సమయం పాటు మెల్కొనే ఉంటాడు. పొద్దంతా నిద్రపోతాడు. మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఇది మరీ ఎక్కువైంది. ఏం చెయ్యాలో తోచడం లేదు. మంచి సలహా ఇవ్వగలరు.
- సుచరిత, కరీంనగర్

STUDENTSTRESSED
ఏదైనా సమస్య వచ్చినపుడు మూడు రకాల స్పందనలను మెదడు సూచిస్తుంది. ఫైట్ లేదా ైఫ్లెట్ లేదా ఫ్రీజ్. ఇందులో మీ అబ్బాయి ైఫ్లెట్ అంటే పారిపోవడాన్ని ఆశ్రయిస్తున్నాడు. తాను చాలా గొప్ప విషయాలను నేర్చుకుంటున్నాడని, మీరంతా కూడా చాలా తక్కువ స్థాయి మనుషులనుకుంటూ తనను తాను మభ్యపెట్టుకుంటున్నాడు. వచ్చిన పరీక్షా ఫలితాలు అనుకున్నవి కాదు కాబట్టి విపరీతమైన బాధలో ఉంటారు. అందులోనుంచి వచ్చిందే ఈ పారిపోయే స్వభావం.

మీరు వీలైనంత వరకు తన మార్కులకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడంలేదని, తను ఆరోగ్యంగా ఉండడం, కాలేజీకి వెళ్లడం ముఖ్యమని, కావాలంటే ఇంప్రూవ్‌మెంట్ రాసుకొని మార్కులు తిరిగి తెచ్చుకోవచ్చని తరచుగా మాట్లాడుతూ అతడికి ధైర్యాన్ని ఇవ్వండి. తప్పకుండా మార్పు వస్తుంది. మార్పు కనిపించకపోతే మాత్రం తప్పనిసరిగా సైకాలజిస్ట్‌ను కలిసి తగిన చికిత్స తీసుకుంటే మంచిది. నిపుణులు అతడికి కావాల్సిన ఏకాగ్రత, స్టడీ స్కిల్స్ పెంపొందించుకోవడానికి కావాల్సిన శిక్షణ ఇస్తారు. ఫలితంగా వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. దాంతో తన ప్రవర్తనలోనూ, సాధించే మార్కులలోనూ తేడా కనిపిస్తుంది.
Drverendar

341
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles