బ్రేకప్ బాధితులకో బార్


Thu,February 14, 2019 12:53 AM

ఈ బార్‌లో ఫొటోలు కాలుస్తూ, ఆనందంగా తాగుతారు. ప్రేమలో ఓడిపోయిన వారికి ఇది ప్రత్యేకం? ఎక్కడుంది అంటారా? చదవండి మరి.
Breakup-bar
ప్రేమికులరోజు.. బ్రేకప్ అయిన వారి సంగతేంటి. పాత ఫొటోలు, జ్ఞాపకాలను తలచుకుంటూ బాధపడుతుంటారు. ఒక్కోసారి బాధను మరొకరితో చెప్పుకున్నా తీరదు. బ్రేకప్ అయిన వాళ్లందరూ దక్షిణ ఢిల్లీలోని ఎం-బ్లాక్ మార్కెట్, జీకే-Iలో ఉన్న బార్‌కి క్యూ కడుతున్నారు. ఈ బార్ ప్రత్యేకత ఏంటో తెలుసా? పదే పదే గుర్తుచేస్తున్న ఎక్స్ ఫొటోలన్నింటినీ వారి చేతులతోనే కాలుస్తున్నారు. పాత ఆలోచనలన్నింటినీ తరిమేస్తూ కొత్త జీవితానికి నాంది పలుకుతున్నారు. అంతేకాదు. బార్‌కి విచ్చేసిన వారందరూ ఇష్టమొచ్చినంతా తాగి ఆనందంగా గడపొచ్చు. వాలెంటైన్స్ డేకి మూడు పద్ధతులున్నాయి. ఒకటి, ఎక్స్ ఫొటోలన్నింటినీ సెలెక్ట్ చేసుకోవడం. రెండు, వాటిని ప్రింట్ తీసుకోవడం. మూడు, బార్‌లో అందరితో కలిసి ఫొటోలను కాల్చేయడం. ఈ బార్ పేరు గాస్ట్రోనోమికా కిచెన్ అండ్ బార్. దీని గురించి తెలియగానే ఎన్ని ఫొటోలుంటే అన్నింటినీ వెంట తీసుకెళ్తున్నారు.

434
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles