బ్రేకప్ తర్వాత చుట్టేయండి!


Fri,January 25, 2019 12:02 AM

shimoga
ప్రేమ విఫలమయ్యాక కలిగే బాధ అంతా ఇంతా కాదు. పక్కన వందల మంది ఉన్నా ఒంటరిగా ఉన్నట్టే అనిపిస్తుంది. చుట్టూ ఎంతమంది ఉన్నా ఒక్కరూ లేనట్టు కనిపిస్తుంది. ఆ బాధ అలాంటిది. జీవితంలో కోల్పోయిన అన్నింటిని కన్నా ప్రేమను కోల్పోవడం విచారకరం. అందుకే బ్రేకప్ అయ్యాక చాలామంది సోలోరైడ్‌లు వేస్తుంటారు. దూర ప్రయాణాలు చేస్తుంటారు. లవ్‌లో బ్రేకప్ అయ్యాక ఇండియాలో చూడాల్సిన కొన్ని ప్రదేశాలున్నాయి. అవి చూస్తే చాలు.. గతాన్ని మరిచిపోయి కొత్త అనుభూతుల్ని సొంతం చేసుకోవచ్చు. వచ్చే నెలలో ప్రేమికుల దినోత్సవం ఉన్నది. లవ్‌లో బ్రేకప్ అయిన వాళ్లు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకొని మీకు అందుబాటులో ఉండే ప్రాంతాలను చుట్టేసిరండి.

శిమోగ : కర్ణాటక

ఎత్తైన కొండలు, తలకు తాకుతాయా అన్నట్టు మేఘాలు, చుట్టుపక్కల చూస్తే భయంకరంగా కనిపించే లోయలు జోగ్ జలపాతాల వద్ద కనిపించే దృశ్యాలివవి. ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసే ఈ ప్రదేశాన్ని ఒంటరిగా వెళ్లి చూస్తే మరిచిపోలేని మధురానుభూతి పొందొచ్చు.

మావ్‌పాలాంగ్ ఫారెస్ట్ : మేఘాలయా

కనుచూపుమేర పచ్చదనం, కళ్లకు కనిపించే ఎత్తులో చెట్లు ఆకాశాన్ని తాకే ఎత్తు వాటి పొడవు, భయంకరమైన శబ్దాలు చేసే అడవి జంతువులు ఇలా అన్ని ఉన్న ఫ్యామిలీ ప్యాక్‌లా ఉంటుంది మావ్‌పాలాండ్ అడువులు. మేఘాలయాలో ఉన్న ఈ అడవులు ఇప్పుడిప్పుడే పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇక్కడికి వెళ్తే గతాన్ని మరిచిపోతారు.
Mawphlang

ఇడుక్కి : కేరళ

ఈ ప్రదేశాన్ని చూస్తే మనసు కరిగిపోతుంది. నూతనోత్తేజం కలుగుతుంది. చుట్టు గుట్టలు, మధ్యలో డ్యాం. దానిపై నుంచి రోడ్డు ప్రయాణం చేస్తుంటే కలిగే ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేం. సుందరమైన పరిసరాలు, సహజమైన నీటి సరస్సులను చూస్తుంటే కొండలపై నుంచి జారుతున్న నీటి బిందువుల్లా మీ సమస్యలు కూడా వెళ్లిపోతాయనిపిస్తాయి.

థార్ ఎడారి : రాజస్థాన్

మన దేశంలో ఉన్న ఎడారుల్లో ఇదే పెద్దది. ఇసుక తిన్నెలపై నడుస్తూ అందమైన ఎడారి ప్రాంతాలను చూస్తూ ఉంటే భిన్నమైన అనుభూతి కలుగుతుంది. ఒంటెలపై ఊరేగుతుంటే అందంగా, భయంకరంగా అనిపిస్తుంది. ఎత్తు పల్లాలున్న ఆ ప్రాంతంలో ప్రదేశాలు చూసి జీవితాన్ని అర్థం చేసుకోవచ్చు.
రాన్ ఆఫ్ కుచ్ : గుజరాత్ సాల్ట్ పాన్స్ ఆఫ్ ఇండియాగా పిలిచే ఈ ప్రాంతం గుజరాత్‌లో చాలా ఫేమస్. ఇక్కడ నైట్ క్యాంపులు వేసి అర్థరాత్రి నక్షత్రాలను చూస్తూ గడిపితే వచ్చే కిక్కు మామూలుగా ఉండదు. మీ బాధలన్ని పోయి చిరునవ్వులు మీ సొంతమవుతాయి.
salt

కెమిరీ మొనాస్టరీ : జమ్మూకశ్మీర్

1664లో నిర్మించిన అతి పురాతన కట్టడం ఇది. లడఖ్‌లోని ఎత్తైన పర్వాతల మధ్యన దీన్ని నిర్మించారు. ప్రశాంతత కోల్పోయిన జీవితాల్లో ఇక్కడికి వెళ్తే కొంత స్వాంతన లభిస్తుంది. ఇవేకాకుండా గోవా, హిమాచల్ ప్రదేశ్‌లోని ఖీర్‌గంగా, అరుణాచల్ ప్రదేశ్‌లోని జీరో, మిజోరంలోని హనలాన్ వంటి ప్రాంతాలకు వెళ్తే మనల్ని మనమే మరిచిపోయి ఒక కొత్త ఆలోచనలను, కొత్త అభిప్రాయాలను పొందుతాం. కారణం అక్కడి వాతావరణం, అక్కడి పరిస్థితులు. జీవితంలో అన్ని కోల్పోయామని బాధపడే వాళ్లు ఇక్కడికి వెళ్లి చాలా నేర్చుకోవచ్చు. అలా చేస్తే విహారం విజయవంతం అవుతుంది. విజ్ఞానమూ లభిస్తుంది.

900
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles