బ్రిటీష్ ఆర్మీలో భారత మహిళలు!


Mon,December 17, 2018 01:42 AM

త్రివిద దళాలలో సత్తా చాటుతూ దేశానికే గర్వకారణంగా మారుతున్న మహిళా మణులను ఇటీవల చాలామందిని చూశాం. అయితే మనవాళ్లు విదేశీ సైన్యంలోనూ ఉన్నారనే విషయం మీకు తెలుసా? బ్రిటీష్ మిలటరీకి చెందిన రాయల్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరి మన సత్తా ఏంటో చాటారు ఇద్దరు మైనార్టీ మహిళలు.
air-force
పంజాబ్‌కు చెందిన మన్‌దీప్ కౌర్ బ్రిటీష్ విమాన సైన్యాధికారిగా సేవలందిస్తున్నారు. విదేశాలకు సేవలందించిన మొదటి సిక్కు సైన్యాధికారిగా రికార్డు సృష్టించారు కౌర్. విదేశీ సైన్యాధికారిగా సేవలందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న కౌర్‌కు తోడుగా మరో మహిళ నిలిచింది. కెన్యాకు చెందిన అలీ ఒమర్ బ్రిటీష్ సైన్యంలో సేవలందిస్తున్న మొదటి భారత ముస్లీ అధికారి. యూకేలో ఇంజినీరింగ్ చేస్తుండగానే ఆమె సైన్యాధికారిగా ఎంపికయ్యారు. కోర్సు అనంతరం ఆమె 2005లో డాక్టరేట్ పట్టా అందుకున్నారు. అలీ ఒమర్ పోర్ట్స్‌మౌత్ యూరివర్సిటీలో మాస్టర్స్‌లో డిగ్రీ చేశారు. తర్వాత రాయల్ ఎయిర్ ఫోర్స్‌లో చేరి బ్రిటీష్ సైన్యంలో సేవలందిస్తున్నారు. సైనికులు, నావికులు, మహిళలు, కుటుంబాలకు అండగా నిలబడుతూ ప్రోత్సహిస్తున్నారు. మొదటి సిక్కు, ముస్లిం సైన్యాధికారులైన ఈ ఇద్దరి మహిళా మణులు ప్రపంచవ్యాప్తంగా నీరాజనాలు అందుకుంటున్నారు. మహిళలంటే వంటింటికే పరిమితం అయ్యేవాళ్లు ఇప్పటికీ ఉన్నారనీ.. ఈ ఇద్దర్ని చూసైనా మహిళలకు ఉన్న విస్త్రృత అవకాశాలు ఏంటో తెలుసుకోవాలని నెటిజనులు సూచిస్తున్నారు. మరోవైపు భారత ప్రజానీకంతో పాటు బ్రిటీష్ ప్రజానీకం కూడా వీరి ఇరువురి నైపుణ్యాన్ని.. సాహసాన్ని మెచ్చుకుంటున్నారు.

630
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles