బొమ్మలాంటి మనిషి!


Sun,March 3, 2019 01:34 AM

ఇతన్ని చూడండి అచ్చం బొమ్మలాగే ఉన్నాడు కదా! ఇప్పుడితను ఇంటర్నెట్‌లో సంచలనం. హ్యుమన్ డాల్‌గా నెట్టింట్లో వైరల్ అవుతున్నాడు. చూపులను ఇట్టే ఆకట్టుకుంటున్నాడు.
Human-doll
మేకప్ మాయాజాలం కంటిని కనికట్టు చేసేస్తుంది. ముసలివారిని సైతం నవ యవ్వనంగా చేస్తుంది. అలాగే పడుచువారిని కూడా ముసలివారిగా చేసే మాయాజాలం మేకప్ సొంతం. అటువంటి మేకప్ మాయా జాలమే ఈ హ్యూమన్ డాల్. ఈ ఫొటోను చూడగానే అందంగా ఉన్న బొమ్మ అనిపించడం ఖాయం. ఇది బొమ్మకాదు మనిషి. పేరు మెట్‌కువాటా. ఉండేదేమో జపాన్‌లో. ఇతని తండ్రి మాసూమీ కువాట. తండ్రి ఆర్టిస్ట్‌గా, మోడల్‌గా బేస్‌బాల్ ఆటగాడిగా జపాన్‌లో సుపరిచితుడు. మెట్‌కు ప్రస్తుతం 24 యేండ్లు. కొంతకాలంగా మెట్‌కువాటా ఇంటర్నెట్‌లో సంచలనంగా మారిపోయాడు. కారణం ఇతని ఆకారం. జపాన్ సోషల్ మీడియాలో మెట్ కువాటాను ఫారెన్‌ప్రిన్స్‌గా అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే యానిమేటెడ్ క్యారెక్టర్‌లా కనిపిస్తుంటాడు కాబట్టి. అయితే.. ఇలా అందమైన బొమ్మలా మారడానికి మెట్ ఎలాంటి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోలేదు. బ్యూటీ ప్రొడక్ట్స్, ట్రీట్‌మెంట్లపై ఇతనికి చాలా ఆసక్తి. కేవలం మేకప్‌తోనే ఇలా మారగలిగానని చెబుతున్నాడు మెట్‌కువాటా.

631
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles