బొంతతో పెండ్లి!


Tue,January 29, 2019 01:01 AM

గంతకు తగ్గ బొంత అన్న మాట ఊరికే అనలేదు. నిత్యం కప్పుకునే బొంతతో ప్రేమలో పడిందో మహిళ. త్వరలో అంగరంగ వైభవంగా ఆ బొంతను పెండ్లాడేందుకు సిద్ధమవుతున్నది.
ciblic
మీరు విన్నది నిజమే! నిత్యం కప్పుకునే బొంతతో ఒకావిడ ప్రేమలో పడింది. కొన్ని రోజుల్లో ఆ బొంతను పెండ్లి కూడా చేసుకోబోతున్నది. ఇంగ్లాండ్‌లోని ఎక్సెటర్‌కు చెందిన 49 యేండ్ల పస్కేల్ సెల్లిక్ అనే మహిళ ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నది. రోజూ తనకు వెచ్చదనాన్నిచ్చే బొంతను పెండ్లాడబోతున్నానంటూ తన బంధుమిత్రులను ఆహ్వానిస్తున్నది. ప్రేమ ఎప్పుడు ఎక్కడ పుడుతుందో తెలీదు. దాని గురించి ఎవరూ చెప్పలేరు. కొంతమంది పెంపుడు జంతువుల ప్రేమలో పడుతారు. మరికొంతమంది మొక్కలను ప్రాణంగా ప్రేమిస్తారు. ఈమె మాత్రం బొంతతో ప్రేమలో పడడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. బొంతను ముట్టుకుంటే తనకు ఎంతో రొమాంటిక్‌గా ఉంటుందని చెబుతున్నది సెల్లిక్. ఎంతో హాయినిచ్చే ఈ బొంత ఏకాంతాన్ని దూరం చేస్తుందట. పస్కేల్ తన పెండ్లి రోజున వధువు ధరించే రొటీన్ డ్రెస్‌కు బదులు నైట్ గౌన్ ధరిస్తానని తెలిపింది. ఎక్స్‌టర్‌లోని రౌగ్మొంట్ గార్డెన్స్‌లో ఫిబ్రవరి 10న మధ్యాహ్నం 2 గంటలకు ఆమె పెండ్లి వేడుక జరుగనుందట. ఈ పెండ్లికి అందరూ ఆహ్వానితులే!

548
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles