బైపాస్ సర్జరీలో జాగ్రత్తలు


Thu,August 10, 2017 12:24 AM

గుండె సంబంధిత వ్యాధులు ఈ రోజుల్లో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకు తగిన చికిత్సలు కూడా చాలా అందుబాటులోకి వచ్చాయి. గుండె సంబంధిత రక్తనాళల సమస్య కరోనరీ ఆర్టరీ డసీజ్. ఈ సమస్యకు సాధారణంగా బైపాస్ సర్జరీ లేదా యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్ అమర్చడం ద్వారా చికిత్స అందిస్తారు. ఇలాంటి చికిత్స తీసుకున్న వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం గురించిన అవగాహన చాలా అవసరం.
heart

ఇదో మేజర్ సర్జరీ


కరోనరీ బైపాస్ సర్జరీ నిజానికి చాలా పెద్ద సర్జరీ. ఈ సర్జరీ ద్వారా గుండెకు రక్త ప్రసరణ జరుగడానికి ఒక కొత్త దారిని ఏర్పాటు చేస్తారు. ఈసర్జరీ చెయ్యడానికి పూర్తిస్థాయిలో అనస్థీషియా అవసరం అవుతుంది. అంతేకాకుండా చాలా రకాలుగా ఇతర సపోర్ట్ సిస్టంలను కూడా ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. ఈ సర్జరీకి దాదాపుగా 3 గంటల సమయం పడుతుంది. ఈ సర్జరీకి సంబంధించిన గాయం, దాని తాలూకు అసౌకర్యం పూర్తిగా తగ్గిపోవడానికి 2-19 నెలల కాలం పట్టవచ్చు. చాలామంది ఈ సర్జరీ తర్వాత 1,2 నెలల్లో తమ పనులు మామూలుగా నిర్వర్తించుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన రక్తప్రసరణ మార్గంలో తిరిగి అడ్డంకులు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. మూడు ముఖ్య విషయాలు ఎప్పుడూ గుర్తుంచుకుని ఆచరించాలి.
-ప్రమాదానికి కారణమయ్యే బీపి, డయాబెటిస్ వంటి వాటిని అదుపులో ఉంచుకోవడం
-రక్తం పలుచబరిచే బ్లడ్ థిన్నర్స్, స్టాటిన్స్ అనే మందులను జీవిత పర్యంతం వాడడం
-ఇతర అనారోగ్య సమస్యలు కలుగకుండా నివారించుకోవడం
-క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ ఉండడం

ఇవి చెయ్యకూడదు


-సర్జరీకి సంబంధించిన గాయం, దాని చుట్టూ ఉండే అసౌకర్యం గురించి ఎక్కువ బెంగ పడకూడదు.
-కడుపునిండా భోంచేసి నడువ కూడదు
-డాక్టర్ సలహా లేకుండా ఎవరికి వారే వృత్తి సంబంధిత బాధ్యతల్లో చేరిపోవడం
-వంగడం, బరువైన పనులు చెయ్యడం, యాత్రలు చెయ్యడం, ఈత వంటి వ్యాయామాలు చెయ్యడం, ఉపన్యాసాలు ఇవ్వడం, శృంగారం వంటివి డాక్టర్ సలహా లేకుండా చెయ్యకూడదు.
-ఆల్కహాల్, ఫాస్ట్‌ఫుడ్ వంటి వంటి వాటికి దూరంగా ఉండాలి.
harts

495
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles