బీమా పాలసీ తీసుకుంటున్నారా?ఈ పొరపాట్లు చేయొద్దు


Sat,February 2, 2019 12:05 AM

బీమా.. ఇది ఉంటే ప్రతి ఒక్కరికీ ఓ ధీమా. బీమా ప్రయోజనాలు అన్నీఇన్నీ కావంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా కుటుంబానికి పెద్ద దిక్కు దూరమైతే.. ఆ వ్యక్తి బీమా మిగతా కుటుంబ సభ్యులకు ఎంత ఆసరాగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే దయనీయ పరిస్థితుల్లో ఆర్థిక రక్షణను అందించేదే బీమా. ఆరోగ్య బీమాతో ఆర్థిక భరోసాతోపాటు ఆస్పత్రి ఖర్చులూ అందుతున్నాయి. జీవిత బీమాతో చనిపోయినవారిపై ఆధారపడినవారికి భద్రత లభిస్తున్నది. అయితే బీమాల క్లెయింల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. కొన్ని సమయాల్లో క్లయిములు తిరస్కరణకు గురవుతున్నాయి. దీనివల్ల అసలే ఇబ్బందుల్లో ఉన్నవారికి ఆర్థిక సమస్యలు చుట్టుముడుతున్నాయి. కాబట్టి ఎందుకిలా జరుగుతున్నది అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా
ఉన్నది. ఒక్కసారి వాటిని తెలుసుకుందామా..

Life-Insurance
జీవిత లేదా ఆరోగ్య బీమా కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు.. బీమా సంస్థలు మీ వివరాలన్నింటిని తీసుకుంటాయి. ఈ సమయంలో మీరు తప్పుడు వివరాలనుగానీ, అసత్య సమాచారాన్నిగానీ ఇచ్చినట్లయితే బీమా క్లెయింల సమయంలో ఇబ్బందులు తప్పవు. చాలామంది ప్రీమియాన్ని తగ్గించుకోవడానికి తమ గురించిన తప్పుడు వివరాలను బీమా ఏజెంట్లకు ఇస్తూంటారు. వయసు, ఆరోగ్య సమాచారం ఇలాంటి వాటిల్లో అబద్ధాలు బీమా సొమ్మును రాబట్టుకోవడంలో ప్రధాన అడ్డంకిగా నిలుస్తాయన్నది మరువరాదు. మీరిచ్చిన సమాచారం అవాస్తవం అని బీమా సంస్థ గుర్తిస్తే..క్లెయింలను తిరస్కరిస్తుంది. కాబట్టి బీమా వివరాలను జాగ్రత్తగా చదివి.. సరైన సమాచారం ఇవ్వడం ప్రధానం. ఒకవేళ దరఖాస్తు ఫారాల్లో అడిగినది మీకు సంబంధించినది కానట్లయితే అప్పుడు NA అనిగానీ లేదంటే X గుర్తునుగానీ పెట్టండి. దీనివల్ల ఆ తర్వాత అక్కడ ఎవరైనా తప్పుడు సమాచారం నింపడానికి అవకాశం ఉండదు. అన్నీ పూర్తయ్యాక మీరు నింపిన ఫారాన్ని ఓ ఫోటో తీసి భద్రపరుచుకోండి. రేపటి రోజుల్లో సమస్యలు వస్తే అది ఉపయోగపడగలదు.
bag-dollar

పాలసీ బకాయిలు

బీమా పాలసీలు తీసుకున్నప్పుడు వాటి ప్రీమియం చెల్లింపుల్లో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. గడువులోగా నిర్ణీత చెల్లింపులు చేసినట్లయితే పాలసీ సజావుగా సాగుతుంది. అలాకాకుండా సక్రమంగా చెల్లించకపోతే పాలసీ ప్రయోజనాలు దూరమయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది. కాబట్టి బీమా ప్రీమియం చెల్లింపులు ఎప్పుడూ కూడా ఆలస్యం కాకుండా, బకాయిలు పడకుండా చూసుకోవడం ఉత్తమం. సాధారణంగా బీమా సంస్థలు.. ప్రీమియం చెల్లింపులకు 15 లేదా ఒక నెల రోజులదాకా గ్రేస్ పీరియడ్ ఇస్తూంటాయి. డ్యూ డేట్‌పై ఇది వర్తిస్తుంది. అయితే ఈ వెసులుబాటునూ మీరితే ఆలస్యపు జరిమానాలు చెల్లించకతప్పదు. ఇలా కొనసాగుతూపోతే బీమా లాభాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. కనుక బీమా పాలసీలు కొనేటప్పుడే మీమీ ఆర్థిక స్థోమతను దృష్టిలో పెట్టుకుని లేదంటే మీమీ ఆదాయ వనరులను పరిగణనలోకి తీసుకుని ప్రీమియం చెల్లింపుల కోసం నెలసరి లేదా త్రైమాసిక లేదంటే అర్ధవార్షిక, వార్షిక వాయిదాలను నిర్ణయించుకోండి. దీనివల్ల ప్రీమియం పేమెంట్లలో ఇబ్బందులను అధిగమించవచ్చు.
img4

వ్యాధులను దాచొద్దు

ఆరోగ్య బీమా పాలసీ కింద అప్పటికే ఉన్న వ్యాధులు తరచూ నిర్దేశిత వ్యవధి ల్యాప్సైన తర్వాతగానీ కవరేజీలోకి రావడం లేదు. పాలసీ నిబంధనల ప్రకారం అది 3 లేదా 4 ఏైండ్లెనా కావచ్చు. కాబట్టి ఒకవేళ మీరు మీకున్న వ్యాధుల గురించి బీమా పాలసీలు కొన్నప్పుడే దరఖాస్తు ఫారాల్లో పేర్కొనకపోతే.. ఆ వివరాలను నిర్దేశిత వెయిటింగ్ పీరియడ్ లోపుగానీ, తర్వాతగానీ క్లెయిం చేసినా ఫలితం ఉండకపోవచ్చు. బీమా సంస్థలు మీ విజ్ఞప్తిని తిరస్కరించే అవకాశాలే ఎక్కువ. ఇక బీమా సంస్థలు పాలసీని అమ్మే వేళ మీ ఆరోగ్య పరీక్షల వివరాలను కోరినైట్లెతే అన్ని పరీక్షలను చేయించుకుని, ఆ వివరాలను సమర్పించండి. దీనివల్ల అప్పటికే మీకున్న వ్యాధులకు బీమా ప్రయోజనం తప్పకుండా అందే వీలుంటుంది. బీమా సంస్థలు సైతం మీ క్లయిములను తిరస్కరించే వీలుండదు. దరఖాస్తుల్లో ముందే పేర్కొన్నాం కాబట్టి మన వాదనే చెల్లుతుంది. అంతేగాక ఆరోగ్యం విషమించినప్పుడు, ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నప్పుడు బీమా ఉందన్న ధీమా మీకు కలుగుతుంది. ఇది మీరు త్వరగా కోలుకోవడానికి ఎంతగానో దోహదపడుతుంది.
drinks-wine-bottle

అలవాట్లనూ చెప్పండి

బీమా పాలసీల్లో ఏ చిన్న విషయాన్నీ దాచకూడదు. దానివల్ల భవిష్యత్తులో పెద్ద మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వస్తుంది. చివరకు మీకున్న అలవాట్లనూ దాయడం మంచిది కాదు. ఉదాహరణకు పొగ త్రాగడం, మద్యం సేవించడం వంటి అలవాట్లున్నా వాటిని పాలసీ దరఖాస్తు ఫారాల్లో పేర్కొనండి. అలాగే ఆదాయం వివరాలనూ మరుగున పెట్టాలని చూడకండి. జీవిత బీమా పాలసీల కొనుగోలు సమయంలో ఇది చాలాచాలా ముఖ్యం. దీనివల్ల మీ ఆదాయానికి తగ్గ పాలసీలను ఎంచుకుని, తగిన ప్రతిఫలం పొందే అవకాశం ఉంటుంది. ఒక్కో పాలసీ ప్రయోజనం ఒక్కోలా ఉంటుందన్న విషయం తెలిసిందే.
pending
ఇకపోతే మరో బీమా సంస్థ నుంచి మీకు గతంలోనే పాలసీ ఉన్నైట్లెతే ఆ వివరాలనూ కొత్త పాలసీ కొనుగోలు సమయంలో పేర్కొనండి. అంతేగాక మీ ఎత్తు, బరువు, వయసు, చిరునామా, నామినీ ఇలాంటి వివరాలనూ సరిగ్గా ఇవ్వండి. దీనివల్ల క్లయిములు త్వరగా కావడానికి వీలుంటుంది. కాబట్టి ఏ చిన్న విషయం మరిచినా.. ఆ తర్వాత అది పెద్ద సమస్యనే సృష్టిస్తుందన్నది మాత్రం మరువరాదు.


క్లెయింల్లో ఆలస్యం

బీమా క్లయిములను ఆలస్యంగా దాఖలు చేసినా అవి తిరస్కరణకు గురయ్యే వీలున్నది. సాధారణంగా జీవిత బీమా సంస్థ లు.. బీమా పొందిన వ్యక్తులు చనిపోతే, అందు కు సంబంధించిన సరైన సమాచారాన్ని రాబట్టుకోవడం కోసం తక్షణ విచారణను చేపడుతాయి. కాబట్టి క్లెయింల్లో ఆలస్యం లేనిపోని అనుమానాలకు దారితీస్తుంది. మోసాలకు తావుందా? అన్న కోణంలో బీమా సంస్థలు ఆలోచిస్తాయి. దీనివల్ల బీమా సొమ్ము చేతికి రావడం ఆలస్యమవుతుంది.
ADIL
కనుక వీలైనంత త్వరగా క్లెయింలను దాఖలు చేసుకోవడమే మంచిది. అలాగే ఆరోగ్య బీమా సంస్థలు సాధారణంగా 48 గంటల్లోగా ఆస్పత్రుల చికిత్స వివరాలను కోరుతాయి. ఈ గడువులోగా సంబంధిత వివరాలను అందించనైట్లెతే సెటిల్మెంట్లలో జాప్యం జరిగి ఖర్చులు మనమీదే పడే అవకాశాలుంటాయి. ఒకవేళ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లాలనుకుంటే.. ఆ సమాచారాన్ని ముందుగానే బీమా సంస్థలకు తెలియజేయడం ఉత్తమం. దీనివల్ల క్లెయింల తిరస్కరణ, ఆలస్యం వంటి సమస్యల్ని సులభంగా అధిగమించినవారమవుతాం.

1382
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles