బీమా ధీమా కోసమే


Sat,February 16, 2019 01:39 AM

Life-Insurance
సాధారణంగా చాలామంది ఇన్సూరెన్స్ పాలసీని పన్ను మినహాయంపుల కోసమే తీసుకుంటారు. ఇన్సూరెన్స్ కోసం చెల్లించే ప్రీమియంను రూ. 1.50 లక్షల వరకూ ఆదాయం పన్ను సెక్షన్‌లోని 80సీ ప్రకారం పన్ను మినహాయింపును పొందవచ్చు. ఈ సెక్షన్ కింద అనేక పెట్టుబడులకు మినహాయింపు లభిస్తున్నప్పటికీ అందులో అగ్రస్థానం ఇన్సూరెన్స్ ప్రీమియంలదే. పన్ను మినహాయింపుల కోసం ప్రతి ఏటా కొత్త పాలసీలను తీసుకోవడం చాలా మందికి అలవాటుగా మారింది. కానీ, కేవలం పన్ను మినహాయింపుల కోసమే ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకోవడం మంచింది కాదు. పన్ను మినహాయింపుల కోసం తక్కువ ప్రీమియం పాలసీలను తీసుకోవడం వల్ల మెచ్చూరిటీ సమయంలో మనకు వచ్చే లాభాలు కూడా చాలా తక్కువగానే ఉంటాయి. దానికి బదులుగా కొత్త పాలసీని మీ జీవితానికి బీమా కల్పించడంతో పాటు మీ తదనంతరం మీ కుటుంబానికి భద్రత కల్పించే పాలసీని ఎంపిక చేసుకోండి.


జీవిత బీమాను ఎంచుకునే ముందు..

మీ ఆదాయం, లైఫ్ స్టయిల్, ఆర్థిక లక్ష్యాలు, రుణాల చెల్లింపు తదితర అన్ని అంశాలను దృష్టింలో ఉంచుకుని మీ కుటుంబ అవసరాలను బట్టి ఎంత లైఫ్ కవర్ ఉండాలో ఒకసారి మదింపు చేసుకోవాలి. ద్రవ్యోల్బణాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఇన్సూరెన్స్ కవరేజీ ఉండేలా చూడాలి. జీవిత బీమా అనేది దీర్ఘకాల సాధనం కనుక, మనం తీసుకోబోయే ఇన్సూరెన్స్ పాలసీ, కుటుంబం మీ మీద ఆధారపడేంత కాలానికి తీసుకోవడం మేలు. ఉదాహరణకు మీకు ఐదేండ్ల పిల్లవాడు ఉన్నాడనుకుందాం. అతను జీవితంలో స్థిరపడేందుకు కనీసం మరో 20 నుంచి 30 ఐదేండ్ల సమయం పట్టవచ్చు. మీ పిల్లవాడు ఆర్థికంగా స్థిరపడే వరకు అంటే వచ్చే 25 ఏండ్ల వరకూ ఇన్సూరెన్స్ కవరేజీ ఉండేలా బీమాను తీసుకోవాలి. మీ కవరేజీ మీ మీద ఆధారపడిన వారి ఆర్థిక అవసరాలను తీర్చే విధంగా ఉండాలి. అయితే ఎంత కవరేజి ఉండాలి అనేదే ప్రశ్న. కవరేజీ ఎంత ఉండాలనేదానికి అనేక రకాల లెక్కింపు పద్ధతులున్నాయి. అతి సులభంగా అర్థం చేసుకోవాలనుకుంటే మీ వార్షిక ఆదాయానికి 10 నుంచి 20 రెట్ల కవరేజీ ఉండాలి. ఉదాహరణకు మీ వార్షిక ఆదాయం రూ. 5 లక్షలు ఉంటే బీమా కవరేజీ కనీసం రూ. 50 లక్షల నుంచి రూ. కోటీ వరకు ఉండాలి.


పన్ను మినహాయింపే ప్రధానం కాదు

పాలసీని తీసుకునే ముందు కుటుంబ అవసరాలు, వాటిని తీర్చడానికి అవసరమైన మొత్తం అంశాలను దృష్టిలో ఉంచుకోండి. కేవలం పన్ను మినహాయింపు కోసమే బీమా పాలసీలను తీసుకోవద్దు. వివిధ జీవిత బీమా కంపెనీలు ఆఫర్ చేస్తున్న పాలసీలలోని అన్ని అంశాలను పోల్చి చూడండి. మీరు ఎంపిక చేసుకున్న పాలసీ గురించి పూర్తిగా తెలుసుకోండి. ప్రీమియంలను ఇతర కంపెనీల పాలసీలతో పోల్చి చూడండి. అలాగే ైక్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియోను కూడా పోల్చండి. అన్నీ తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకోండి. అలాగే ఎలాంటి పరిస్థితుల్లో పాలసీని కొనుగోలు చేస్తున్నారో కూడా ముఖ్యమే.
Life-Insurance1

మొదటి పాలసీ అయితే..

ఇన్వెస్ట్‌మెంట్‌ను ఇన్సూరెన్స్‌ను కలిపి చూడకండి. మీ మరణాంతరం మీ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడమే ఇన్సూరెన్స్ పాలసీ ముఖ్య ఉద్దేశ్యం. దీన్ని దృష్టిలో ఉంచుకుని మొదటి సారిగా పాలసీని తీసుకునే ముందు టర్మ్ పాలసీని పరిశీలించండి. ఓ మోస్తారు ఆదాయమే ఉండి కెరీర్ ప్రారంభంలో ఉంటే టర్మ్ పాలసీ సరిపోతుంది. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీకి ఎలాంటి షరతులూ లేనివి మీకు సరిపోతాయి. ఎందుకంటే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. అలాగే కవరేజీ కూడా సంప్రదాయ పాలసీల కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. సమయానుకూలంగా మీ టర్మ్ పాలసీ కవరేజ్ కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. మీ ఆదాయం పెరిగే కొద్దీ మీ అవసరాలకు తగ్గట్టుగా పాలసీని మార్చుకోవచ్చు.


ఒకవేళ అదనపు బీమా కోసమే అయితే..

ఇప్పటికే మీకు అనేక ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటే, కొత్త పాలసీ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారో ఆలోచించండి. మీరు గతంలో తీసుకున్న పాలసీ కవరేజి సరిపోదని గుర్తించినప్పుడు అదనంగా పాలసీ తీసుకోవాలని అనుకుంటుండవచ్చు. అలాగే సంపదను పెంచుకోవడానికి కూడా ఒక సాధనంగానూ లేదా పన్ను మినహాయింపు కోసమే తీసుకోవాలని భావిస్తూ ఉండవచ్చు. మీ లక్ష్యాలు ఎవైనా సరే, మీరు తీసుకుంటున్న పాలసీపై మీరు చెల్లించే ప్రీమియంకు సరిపడా ప్రయోజనాలు, రాబడులు ఉన్నాయో లేదో ఒక సారి పరిశీలించండి. ఈ నేపథ్యంలో సరైన జీవితాంత మద్దతు ఇవ్వగల పాలసీని ఎంచుకుని మీ కుటుంబానికి ఆర్థిక భరోసాను కల్పించండి.
Life-Insurance2

575
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles