బీమా తో ఎంతో ధీమా


Sat,December 22, 2018 01:14 AM

బీమాతో ఎంతో ధీమా. పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయంపై మీరు కచ్చితంగా ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ దీని నుంచి మినహాయింపు పొందాలనుకుంటున్నారా అయితే మీరు కచ్చితంగా బీమా పాలసీ తీసుకోవాల్సిందే. దేశీయ చరిత్రలో పన్ను పొదుపు కావాలంటే ప్రత్యామ్నాయం బీమానే. ఇది కేవలం పన్నులనుంచి మినహాయింపు లభించడమే కాదు ఒకవేళ మీరు మరణిస్తే ఆ సమయంలో ఆర్థికంగా మీ కుటుంబానికి ప్రయోజనకరంగా ఉండనున్నది. మీరు కచ్చితంగా పాలసీ తీసుకోవడం మరువకండి. ఆర్థిక సంవత్సరం ముగిసేవరకు ఎందుకు వేచి చూడటం ఇప్పుడే తీసుకోండి.
Tax

మరింత సమయం కావాలా..

బీమా అవసరాల నిమిత్తం మరింత సమయం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఎందుకంటే అకస్మాత్తుగా మీరు మరణించారనుకో..అప్పుడు మీ కుటుంబం రోడ్డుపై పడే అవకాశాలు ఉన్నాయి. ఆ సమయంలో మీరు చేసిన పొదుపు, పెట్టుబడులు మీ కుటుంబానికి శ్రీరామ రక్షలాగా ఉండనున్నాయి. దీర్ఘకాలికంగా కుటుంబం నిలబడాలంటే ముందస్తు చర్యల్లోభాగంగా పొదుపు చేయాల్సిన అవసరం ఉన్నది. అలాగే అకస్మాత్తుగా మీ కుటుంబానికి సంబంధించిన వారు ఆసుపత్రుల్లో చేరితే ఆ సమయంలో మీరు చేసిన పొదుపు ఉపయోగపడవచ్చును. అందువలన, మీరు కనీసంగా ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలి. అప్పుడే నిశ్చితంగా జీవనాన్ని కొనసాగించిన వారు అవుతారు. ఒక్కో కేసుకు సంబంధించి సమ్ అస్యూర్డ్ లభించేదానిపై లెక్కలు వేసుకోవాల్సి ఉంటుంది. ఇది తన ఆర్థిక పరిస్థితులకు తగ్గట్టుగా ప్రత్యేక ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.

పన్ను చెల్లింపులపై స్పష్టత..

పన్ను చెల్లించడానికి సిద్దమవుతున్నారా..లేదా పొదుపు చేయాలనుకునే వారు..ఆ సంవత్సరానికి ఎంతమేర పన్ను చెల్లించేదానిపై స్పష్టత ఉండాలి. ఇందుకోసం మీ నెలసరి వేతన స్లిప్ పొందివుండాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో మీ అకౌంటెంట్‌తో మాట్లాడి కొత్తగా వచ్చిన పన్ను స్లాబ్‌కు సంబంధించి సమాచారాన్ని సేకరించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏయే మార్గాల్లో పన్ను ఆదా పొందవచ్చునో పూర్తి వివరాలు తెలుసుకోవాలి. రెంట్, గృహ రుణాలకోసం చెల్లించే నెలవారి బిల్లు, చిన్న పిల్లల స్కూల్ ఫీజు, పీఎఫ్ తగ్గింపు, గతంలో ఉన్న బీమా పాలసీలను జతపరిస్తే మీకు పన్ను మినహాయింపు పొందవచ్చును. పన్ను ఆదా పొందాలనుకునేవారు ఎంతమేర బీమా లేదా పెట్టుబడులు పెట్టేదానిపై లెక్కలు వేసుకోవాలి. ప్రస్తుతం డిసెంబర్ కావడంతో మరో మూడు నెలల సమయం ఉన్నది. ఈ సమయంలో ఎలా పన్ను రాయితీ పొందాలో తీవ్రంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలి.

మోసపూరిత పాలసీలపై కన్నెయండి..

మోసపూరిత పాలసీలపై ఒకింత జాగ్రత్త వహించండి. వినియోగదారుడిని తప్పుదారి పట్టించే పాలసీలను అత్యధిక మంది కొనుగోలు చేస్తుంటారు. ఇలాంటి పాలసీలను కొనుగోలు చేయకండి. ఎందుకంటే ఈ పాలసీల కవరేజ్ సరిపోదు..అలాగే రిటర్నులు చాలా తక్కువగా ఉన్నప్పటికీ వినియోగదారుడు పాలసీ తీసుకోవడానికి మొగ్గుచూపాలి. జీవిత, ఆరోగ్య బీమా పాలసీలు దీర్ఘకాలిక సాధనంగా అభివర్ణించవచ్చును. దీర్ఘకాలికంగా ఎంతమేర లాభాం చేకూర్చే పాలసీలను కొనుగోలు చేయాలి. డిసెంబర్ నుంచి మార్చి వరకు పరిశోధనలు చేసి చివరికి తుది నిర్ణయం తీసుకోవాలి. పాలసీని తీసుకునేటప్పుడు ఒక ధరను మాత్రం చూడకూడదు..దాని లక్షణాలు, సమ్ అస్యూర్డ్, రైడర్స్, క్లెయిం సెటిల్‌మెంట్ రేషియో, మినహాయింపులు కూడా చూసుకోవాల్సి ఉంటుంది.

అంత సులభంకాదు..

జీవిత, ఆరోగ్య బీమా పాలసీల్లో ఏది మంచిదో గుర్తించడం అంత సులభంకాదని, కేవలం 15 రోజుల నుంచి 30 రోజుల్లో గుర్తించడం అసంభవం. ఇదే సమయంలో మోసపూరిత పాలసీల నుంచి తప్పించుకునే అవకాశం కూడా వినియోగదారుడికి లభించనున్నది. పాలసీని కొనుగోలు చేయడానికి సమయం చాలా ఎక్కువగా ఉన్నదని, ఈ సమయంలో ఫ్రీ-లుక్ కింద రిటర్నులు సమర్పించేందుకు అవకాశం కూడా ఉన్నది. ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకోవడంతో ఆర్థికంగా బలోపేతం అవడానికి తీసుకోవాల్సిన చర్యలను భేరీజు వేసుకోవాలి. ముఖ్యంగా మీ కుటుంబానికి ఆర్థికంగా సురక్షితంగా ఉండేందుకు పాలసీని తీసుకోవాలి. పన్ను చెల్లింపులు, బీమా తీసుకోవాల్సిన పరిస్థితులు, ఏది ఉత్తమమైన పాలసీ, సరైన సమయంలో పాలసీ తీసుకున్నామో లేదా గమనించుకోవాలి. అప్పుడే మనస్సు కుదుటపడనున్నది. ఇది ఒక సంవత్సరానికిగాదు..జీవితాంతం..నువ్వు పోయిన తర్వాత కూడా ఈ పాలసీ ఉపయోగకరంగా ఉండనున్నది.
- అదిల్ శెట్టి, బ్యాంక్‌బజార్.కామ్ సీఈవో

459
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles