బీమా తీసుకుంటున్నారా వివరాలు దాచొద్దు


Sat,March 2, 2019 12:21 AM

విపత్తు సందర్భాల్లో మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆర్థిక భరోసాను కల్పించడం వల్ల ఇన్సూరెన్స్ పాలసీ మానసిక ప్రశాంతతను కల్పింస్తుంది. అయితే, మీరు పాలసీ తీసుకునే సమయంలో దరఖాస్తులో పేర్కొన్న అంశాలను ఎత్తిచూపుతూ పాలసీ తీసుకున్న ఇన్సూరెన్స్ కంపెనీ మీ క్లయిమ్‌ను తిరస్కరిస్తే వచ్చే మానసిక ఆందోళన విపత్తు కన్నా పెద్దదిగా అనిపిస్తుంది. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు ఆ పాలసీ గురించి పూర్తిగా తెలుసుకోకుండానే గుడ్డిగా దరఖాస్తు మీ సంతకం చేయడం వల్లనే అలాంటి సీరియస్ పరిస్థితులు తలెత్తుతాయి. ముఖ్యంగా మీ తరఫున మరోకరు దరఖాస్తును నింపినప్పుడు మరిన్ని తలనొప్పులు ఎదురవుతాయి.
bhima

బీమా పాలసీని తీసుకునే ముందు అసలు ఎందుకు ఆ బీమా పాలసీని కొనుగోలు చేస్తున్నామో తెలుసుకోవాలి. ఒక వేళ అనుకోని పరిస్థితుల్లో అకస్మిక మరణం సంభవిస్తే మీ కుటుంబ సభ్యులకు ఆర్థికంగా భద్రత కల్పించడం కోసం జీవితబీమా పాలసీని కొనుగోలు చేయాలి. ఆనారోగ్య సమస్యలతో హాస్పిటల్ పాలైతే, ఇప్పుడున్న పరిస్థితుల్లో విపరీతంగా పెరిగిపోయిన హాస్పిటల్ బిల్లు భారం నుంచి తప్పించుకోవడానికి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలి. అందుకని మీరు కొనుగోలు చేస్తున్న పాలసీలో ఎలాంటి రిస్క్‌లు కవర్ అవుతున్నాయో తప్పనిసరి తెలుసుకోవాలి. ఆ పాలసీ ప్రయోజనాలు, అందులో కవర్ అయ్యే అంశాలు, మినహాయించిన అంశాలు తెలసుకోకుండా కొనుగోలు చేస్తున్నట్టయితే మీరు క్లయిమ్ పొందలేకపోయే అవకాశాలుంటాయి. ఇన్సూరెన్స్ రంగం ప్రవేటీకరణ జరిగిన తర్వాత అనేక ఆప్షన్లతో పాలసీలు రావడం మొదలైంది. ప్రతీ పాలసీ ఒక వినూత్నమైన అంశాలతోనూ, పరిమితులతోనూ రూపొందిస్తున్నారు. ఆ పరిమితులు, ప్రయోజనాలను తెలుసుకోవడం మన బాధ్యత.


సరైన డిక్లరేషన్ తప్పనిసరి

ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు దరఖాస్తులో ప్రతి అంశాన్ని పూర్తి వివరాలతో నింపాలి. వయసు, లింగం, ఆరోగ్య స్థితి, అప్పటికే వున్న అనారోగ్య పరిస్థితులు లేదా జబ్బులు, పొగతాగే అలవాటు, గతంలో ఏవైనా ఇన్సూరెన్స్ క్లయిమ్‌లు చేశారా తదితర వివరాలను పాలసీలో తప్పనిసరిగా పేర్కొనాల్సిందే. ఒక వేళ వీటి గురించి సరైన సమాచారాన్ని మీరు దరఖాస్తులో పేర్కొనకపోతే మీ క్లయిమ్ సమయంలో ఇబ్బందులను ఎదుర్కొవాల్సి రావచ్చు. ఉదాహరణకు మీకు పొగ త్రాగే అలవాటు ఉన్నా మీరు దరఖాస్తులో పేర్కొనకపోతే, ఆ తర్వాత పొగత్రాగడం వల్ల వచ్చే జబ్బులతో హాస్పిటల్ పాలైతే మీరు క్లయిమ్ చేయడంలో సమస్యలు ఎదురుకావచ్చు.


చదవండి.. అర్థం కాకపోతే అడగండి

మీ చేతిలోకి పాలసీ అప్లికేషన్ రాగానే, మొత్తం జాగ్రత్తగా చదవండి. అలాగే ఆ పాలసీకి సంబంధించిన బ్రోచర్‌ను కూడా చదవండి. ఎందుకంటే ఆ పాలసీ మీదనే మీ కుటుంబం భవిష్యత్ కూడా అధారపడి ఉంది. చాలా సందర్భాలలో ఇన్సూరెన్స్ ఏజెంట్ మీకో దరఖాస్తు ఇచ్చి ఎక్కడ సంతకం చేయాలో చెప్పడం ఆనవాయితీ. పాలసీని మీకు తొందరగా అంటగట్టాలనే ప్రయత్నంలోనే అలా జరుగుతుందన్న భావం కలుగుతుంది. కొంత మంది ఏజెంట్లు అయితే సంతకం చేయండి, మిగతా అంశాలను తానే చూసుకుంటానని ప్రామిస్ చేయడం కూడా చాలా మందికి అనుభవంలోకి వచ్చి ఉంటుంది. ఇది నిజంగా ప్రమాదకరం. పాలసీ దరఖాస్తును మీరే నింపడానికి ప్రయత్నించండి. ఒక వేళ ఏ అంశానికి సంబంధించి అయినా సందేహం కలిగితే దాన్ని నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు అన్ని విధాల సరిపోతుందనుకున్న తర్వాతనే పాలసీ దరఖాస్తుపై సంతకం చేయండి.


ఏ అంశాలను చూడాలి?


insurance
ఏ పాలసీలో ముఖ్యాంశం కవరేజికి సంబంధించిందే. హెల్త్ పాలసీ అయితే ఏ జబ్బుకి డే కేర్ కూడా కవరేజి కూడా వివరిస్తుంది. లేదా ఏ ఏ జబ్బులకు పాలసీ వర్తించదో లిస్ట్‌ను ఇస్తుంది. అలాగే పాలసీలో మినహాయింపులు తాత్కాలిమా లేదా శాశ్వతమా అనే విశయాన్ని వివరంగా చెప్పడం. అలాగే సబ్ లిమిట్స్, కవరేజి మీద పరిమితులు, కొన్ని రకాల జబ్బుల ట్రీట్‌మెంట్‌కు పరిమితులు, హాస్పిటల్‌లో రూము అద్దె వంటి అంశాలకు సంబంధించిన నిబంధనలు వంటి అంశాలను ప్రత్యేకంగా పరిశీలించాలి. అలాగే ప్రీ, పోస్ట్ హాస్పిటలైజేషన్ వ్యయాలను కూడా కవర్ చేస్తున్నారా లేదో చూడాలి. ఈ ప్రీ, పోస్ట్ హాస్పిటలైజేషన్ కవరేజీ ఒక్కో పాలసీకి ఒక్కో రకంగా ఉంటుంది. అందుకే ఆ పాలసీకి చెందిన బ్రోచర్‌ను, దరఖాస్తును పూర్తిగా చదవాలి. అందువల్ల పాలసీ కవరేజీ మీకు సరిపోతుందా లేదా తెలుస్తుంది. ఒకవేళ కవరేజి సరిపోకపోతే మీరు కొంత హాస్పిటల్ వ్యయాన్ని భరించాల్సి వస్తుంది.


జీవిత బీమా మీ లైఫ్‌స్టయిల్‌కు తగ్గట్టుగా ఉందా?

చాలా వరకు జీవిత బీమా పాలసీలు క్లయిమ్‌ను నిరాకరిండానికి అవసరమైన నిబంధనలను కలిగి ఉంటాయి. మరణం తర్వాత కొన్ని కారణాలతో మీకు క్లయిమ్ రాకపోవచ్చు. ఉదాహరణకు స్కూబా డైవింగ్, పారైగ్లెడింగ్ వంటి స్పోర్ట్స్‌లో మరణం పాలైతే లేదా రిస్క్ అధికంగా ఉన్న దేశాలలో మీరు పర్యటనలో ఉన్నప్పుడు మరణిస్తే కూడా ఇన్సూరెన్స్ కంపెనీ క్లయిమ్‌ను నిరాకరించే అవకాశాలున్నాయి. అందుకని క్లయిమ్‌లను ఏ కంపెనీ ఎలాంటి పరిస్థితుల్లో నిరాకరిస్తుందో తెలుసుకోవడం ఉత్తమం.


గత పాలసీల గురించి సమాచారం ఇవ్వండి

కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు మీకు ఇప్పటికే ఉన్న పాలసీల వివరాలను, ముఖ్యంగా లైఫ్ కవరేజి ఉన్న పాలసీల వివరాలను అడగవచ్చు. అలాంటి సందర్భాల్లో మీరు సరైన సమాచారాన్నే ఇవ్వాలి. కొత్త జీవిత బీమా పాలసీని తీసుకోవడానికి ఆ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. మరి కొన్ని కంపెనీలు ఇప్పటికే ఉన్న పాలసీల వివరాలను డాక్యుమెంట్ రూపంలో కూడా అడగవచ్చు. ఉదాహరణకు మీ వివరాలన్నీ ఇన్సూరెన్స్ ఏజెంట్ వివరించినప్పటికీ పాలసీ డాక్యుమెంట్‌లో పేర్కొనకపోతే కూడా నష్టమే. మీ పాలసీ వల్ల ప్రయోజనం ఏదీ ఉండదు.

క్లుప్తంగా చెప్పాలంటే ఏ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసేటప్పుడు పాలసీ బ్రోచర్, అప్లికేషన్ ఫామ్‌ను తప్పనిసరి పూర్తిగా చదివి అర్థం చేసుకోండి. దరఖాస్తులో ఖాళీలను వదలకండి. దరఖాస్తును పూర్తి చేసిన తర్వాత మీరు ఒక జీరాక్స్ కాపీని తీసి దగ్గరపెట్టుకోండి. ఒకవేళ మీరు కోరుకున్నట్టుగా పాలసీ లేకపోతే 15 రోజుల్లో ఆ పాలసీని ఉపసంహరించకునేలా ఫ్రీలుక్ పీరియడ్ ఆప్షన్ ద్వారా 15 రోజుల్లో ఆ పాలసీ నుంచి బయటపడవచ్చు.
Adhil-Shetty

525
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles